ఆడపిల్లలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఎంతోమంది మహిళలు కామాంధుల కామపు కోరల్లో  చిక్కుకొని బలైపోతున్నారు. ఇక్కడ ఏకంగా ఒకడు రెండు వారాల వ్యవధిలో 11 మంది మహిళలు చిన్నారులపై రేప్ చేసి పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగాడు. కానీ చివరికి అతని పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా అతనికి 33 సార్లు  జీవితఖైదు విధించింది కోర్టు . బ్రిటన్లో ఈ దారుణ ఘటన జరిగింది. బ్రిటన్లోని మోస్ట్ డేంజరస్ క్రిమినల్ గా పేరు పొందిన జోసెఫ్ మెక్ కాన్  కు న్యాయస్థానం  33 సార్లు  జీవిత ఖైదు విధించింది. 

 


 వివరాల్లోకి వెళితే... అతడు సైకో అతడి పని మనుషులను చంపడం కాదు ఆడపిల్ల కనిపిస్తే చాలు మీద పడి అత్యాచారాలు చెయ్యటం . ఇలా కనిపించిన ఆడపిల్లలపై  అత్యాచారాలు చేసేవాడు  ఈ సైకో. జోసెఫ్ అనే 34 ఏళ్ల సైకో ఏకంగా రెండు వారాల వ్యవధిలోనే 11 మందిపై అత్యాచారం చేశాడు. 11 ఏళ్ళ చిన్నారి నుంచి పండు ముసలి వరకు ఎవరినీ వదిలి పెట్టలేదు ఈ సైకో. ఏప్రిల్ నెలలో రెండు వారాల్లో  11 అత్యాచారాలతో .. ఏప్రిల్ 21న రాత్రి సమయంలో క్లబ్ నుంచి తిరిగి వచ్చిన 21 యువతిని దారిలో బెదిరించి ఇంటికి తీసుకెళ్లి మరి రేప్ చేశాడు.అతని  నుంచి తప్పించుకున్న బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు ఈ సైకో. 

 


 అంతేకాదు తనకు తెలిసిన మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెని  కట్టేసి మరి ఆమె ముందే పిల్లలపై  అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ  సైకో రేపిస్ట్. ఇంకో యువతిని ఎత్తుకెళ్లి 12 గంటల పాటు అత్యాచారం చేసి నరకం చూపించాడు, ఏకంగా 37 అత్యాచార కేసులు, కిడ్నప్ కేసులు ఈ సైకో రేపిస్ట్ పై నమోదయ్యాయి. ఎట్టకేలకు ఈ సైకో రేపిస్ట్ ను పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఇతనికి 33 జీవిత ఖైదులు  శిక్షను విధించింది కోర్టు. అయితే లండన్ లో  మరణ శిక్ష విధించే చట్టాన్ని  రద్దు చేయడం వల్ల  33 జీవిత ఖైదు మాత్రమే విధించినట్లు  కోర్టు తెలిపింది . ఈ సందర్భంగా మాట్లాడిన లండన్ సెంట్ర క్రిమినల్ కోర్టు జడ్జి ఏడిస్ .. సైకో రేపిస్ట్ జోసెఫ్  చేసిన నేరాల పట్ల ఆ వ్యక్తికి కాస్తయినా పశ్చాత్తాపం లేదని తెలిపారు.. ఇతరులు బతికేది కేవలం నీ కోరిక తీర్చడానికి అనుకుంటున్నావ్ అంటూ ఈ సైకో రేపిస్ట్ ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు జడ్జి.

మరింత సమాచారం తెలుసుకోండి: