రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబునాయుడు భయపడిపోయారు. తెలుగుదేశంపార్టీ తిరుగుబాటు ఎంఎల్ఏ వల్లభనేని వంశీ మాట్లాడటానికి లేచి నిలబడగానే చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటమే విచిత్రంగా ఉంది. మాట్లాడటానికి వంశీకి ఎట్టి పరిస్దితుల్లోను అనుమతి ఇవ్వకూడదంటూ స్పీకర్ నే చంద్రబాబు ఆదేశించినట్లుగా మాట్లాడారు.

 

మాట్లాడాలని వంశీ మాట్లాడేందుకు లేదని చంద్రబాబు అండ్ కో లేచి నిలబడగానే అసెంబ్లీలో తీవ్ర గందరగోళం మొదలైంది. నిజానికి వంశీ మాట్లాడటానికి స్పీకర్ అనుమతించిన తర్వాతనే లేచి నిలబడ్డారు. వంశీని మాట్లాడనిస్తే తనతో పాటు కొడుకు లోకేష్ గాలి తీసేస్తాడని,  తమపై  ఆరోపణలు చేస్తాడని చంద్రబాబు భయపడినట్లే ఉంది.

 

ఆ భయంతోనే వంశీని మాట్లాడనీయకుండా శతవిధాల ప్రయత్నించారు. అంటే ఓ సభ్యుడిని మాట్లాడనీయకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. వంశీ మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించిన తర్వాత చంద్రబాబు అండ్ కో అడ్డుకోవటమేంటో ఎవరికీ అర్ధం కాలేదు. వంశీ మాట్లాడేటపుడు ఎవరిపైనైనా అభ్యంతరకరంగా మాట్లాడితే అడ్డుపడచ్చు.

 

సరే తాము ఎంత ప్రయత్నించినా వంశీని మాట్లాడనీయకుండా ఆపటం సాధ్యం కాదని తెలిసిపోయిన తర్వాత వెంటనే చంద్రబాబు సభలో నుండి బయటకు వెళ్ళిపోవటం మరింత ఆశ్చర్యంగా ఉంది. అంటే వంశీ ఏం మాట్లాడుతున్నారో వినేంత ధైర్యం కూడా చంద్రబాబుకు లేదని అర్ధమైపోయింది.

 

అందుకనే వంశీ మాట్లాడటం మొదలుపెట్టగానే చంద్రబాబు బయటకు వెళ్ళిపోయారు.  చంద్రబాబు వెళ్ళిపోగానే మిగిలిన  ఎంఎల్ఏలు కూడా వెళ్ళిపోయారు. వంశీ మాట్లాడటం అయిపోయిందని తెలియగానే మళ్ళీ అందరూ సభలోకి అడుగుపెట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్పీకర్ అధికారాలనే చంద్రబాబు అండ్ కో ప్రశ్నించటం.

 

ఒకపుడు రోజాను నిబంధనలకు విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్ చేయించిన విషయం చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. ఏడాదిపాటు ఎంఎల్ఏను సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేకపోయినా అప్పుడు చేయించారు. ఇపుడు విచక్షణాధికారాల మేరకే స్పీకర్ వంశీని మాట్లాడేందుకు అనుమతించినా చంద్రబాబు అభ్యంతరం చెప్పటం విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: