తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్నపుడు 2014లో వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏలను ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించే చంద్రబాబునాయుడు లొంగ దీసుకున్నారా ? అందరిలోను ఇపుడిదే అనుమానాలు పెరుగుతున్నాయి. తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ టిడిపి ఎంఎల్ఏలను ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించి లొంగ దీసుకునే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు.

 

నిజానికి టిడిపి ఎంఎల్ఏల్లో ఎవరిని కూడా ఇంత వరకూ జగన్మోహన్ రెడ్డి వైసిపిలోకి చేర్చుకోలేదు. జగన్ సిఎం కాగానే కొందరు టిడిపి ఎంఎల్ఏలు, జనసేన ఎంఎల్ఏ వైసిపిలోకి వస్తామని చెప్పినా జగన్ వద్దనే చెప్పారు. ఎందుకంటే వైసిపి తరపునే  151 మంది ఎంఎల్ఏలు గెలిచిన తర్వాత ఇక ఇతర ఎంఎల్ఏలతో అవసరం లేదని జగన్ అనుకున్నారు.

 

ఒకవేళ ఎవరైనా ఎంఎల్ఏ తమ పార్టీ నుండి బయటకు వచ్చేయదలుచుకుంటే ముందుగా పదవికి రాజీనామా చేయాలని స్పష్టంగా చెప్పారు. ఎంఎల్ఏగా రాజీనామా చేయకుండానే పార్టీ మారితే వెంటనే శాసనసభ్యునిపై అనర్హత వేటు వేయాలని జగన్ స్వయంగా అసెంబ్లీలో స్పీకర్ కు సూచించిన విషయం అందరికీ తెలిసిందే. చెప్పిన మాట ప్రకారమే జగన్ ఇప్పటి వరకూ నిలబడ్డారు.

 

అలాంటిది టిడిపి ఎంఎల్ఏలను వైసిపిలో చేరకపోతే ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఏదో ఓ రేప్ కేసులో ఇరికించి ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పిన చంద్రబాబు అందుకు సాక్ష్యాలు మాత్రం చూపించలేదు. ఇవన్నీ చూస్తుంటే గతంలో వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలను చంద్రబాబు టిడిపిలోకి లాక్కున్నారు.

 

అంటే అప్పుడు వారిని కూడా ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించే వాళ్ళని టిడిపిలోకి లాక్కున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. పైగా అప్పట్లో వైసిపి ఎంఎల్ఏలతో పోలీసు అధికారులతోనే చంద్రబాబు మాట్లాడించిన విషయం బయటపడింది. వైసిపి ఎంఎల్ఏలతో నేరుగా పోలీసు అధికారులే మాట్లాడారంటే ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించి ఉండవచ్చనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: