దేశంలో రోజుకు 90కి పైగా అత్యాచారాలు జరుగుతున్నాయి.  ఒక్క దేశంలోనే రోజుకు ఇన్ని జరుగుతుంటే ప్రపంచంలో ఇంకెన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి.  ఏ దేశాలు ఎలాంటి శిక్షలు విధిస్తున్నాయి.  ఏ దేశాలు ఈ విషయంలో సరైన న్యాయాన్ని అనుసరిస్తున్నాయి.  ఎలాంటి శిక్షలు విధిస్తున్నాయి అనే విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ఇప్పటి వరకు భారతదేశంలోనే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని చాలామంది మండిపడుతున్నారు.  

 

అభివృద్ధి చెందిన దేశాలలో సైతం అత్యాచారాలు భారీగానే జరుగుతున్నాయి.  కానీ, బయటకు వస్తున్న సంఖ్యమాత్రం తక్కువగానే ఉంటున్నది.  బ్రిటన్ లో అత్యాచారాల సంఖ్య పెరిగిపోతున్న ఆ పని చేసిన నిందితులకు విధించే శిక్ష జీవితఖైదు మాత్రమే. అంతకు మించి పెద్ద శిక్ష విధించే అధికారం అక్కడి చట్టాలకు లేదు.  ఈ ఏడాది ఏప్రిల్ నెల 34 ఏళ్ల జోసెఫ్ 11 అత్యాచారాలకు పాల్పడ్డాడు. కేవలం 14 రోజుల్లోనే 11 సార్లు మహిళలపై అత్యాచారం చేశాడు.  


ఓ పార్టీలో 25 ఏళ్ళ మహిళపై అత్యాచారం చేసిన తరువాత బాధితురాలు నిందితుడిపై కేసు పెట్టింది.  అయితే, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న జోసెఫ్ అక్కడి నుంచి 14 రోజుల్లోనే 11 సార్లు మహిళలపై అత్యాచారం చేశారు.  కాగా, ఎట్టకేలకు పోలీసులు జోసెఫ్ ను పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు.  విచారించిన కోర్టు అతడిని ఓ సైకోగా భావించింది.  


బతికున్నంత కాలం జైల్లోనే ఉండేలా శిక్ష విధించింది.  జైల్లోనే ఉండేలా శిక్ష అంటే చనిపోయేంత వరకు జైల్లోనే ఉంటాడు.  జైలు జీవితం నిత్యం సెక్యూరిటీ.. సమయానికి అన్ని అందుతాయి.  అది మంచి లైఫ్ కదా.  ఇలానే మనదేశంలో 11 అత్యాచారాలు చేస్తే చూస్తూ ఊరుకుంటారా.. దిశ కేసులో గొడవ చేసినట్టే చేయరు.  కానీ, బ్రిటన్ లో మాత్రం అలా కాదు.  అక్కడ ఇంతపెద్ద నేరం చేసినా ఫైనల్ గా కోర్టు విధించేది జీవితఖైదు మాత్రమే.  ఉరిశిక్షలను అక్కడ రద్దు చేశారు,  

మరింత సమాచారం తెలుసుకోండి: