దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం భారీ తారాగణంతో పాటు మునుపెన్నడు ఎవరూ ఊహించలేని ఊహాత్మక కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి శర వేగంగా సిద్ధమవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'కొమరం భీం' పాత్రను పోషిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'అల్లూరి సీతారామ రాజు' పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం గురించి ఏ వార్త వచ్చిన పెద్ద హాట్ టాపిక్ కావడం గమనార్హం. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే... ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన ఒలివియా మోరీస్‌ నటిస్తుందని ఆర్.ఆర్.ఆర్ చిత్రబృందం ప్రకటించింది. అయితే ఆ ప్రకటించిన రోజే, గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన వ్యక్తిగా ఒలివియా మోరీస్ రికార్డ్ సృష్టించింది. దీంతో... యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు, ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో స్పష్టమైంది.


https://mobile.twitter.com/ViralHub007/status/1204410037852000264


ఇతర చిత్రం బృందాల వలె.. ఆర్ఆర్ఆర్ మూవీ బృందం ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క పోస్టర్ ను విడుదల చేయలేదు. కానీ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక  ఫొటో సామాజిక మాధ్యమాల్లో లీక్ అయ్యింది. కొమురం భీం జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఎన్టీఆర్ లుక్ విడుదల కాకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.

https://mobile.twitter.com/SmashTollywood/status/1204250566987153409

అయితే ప్రస్తుతం నిరాశలో ఉన్న అభిమానులకు ఉపశమనం కలిగించే రీతిలో జూనియర్ ఎన్టీఆర్ విశాఖ ఎయిర్ పోర్టు లో కనిపించాడు.

https://mobile.twitter.com/Tarak_GirlsTeam/status/1204363978991783936

అక్కడ ఉన్న అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ ను గుర్తుపట్టి సెల్పి ఫోటోల కోసం ఎగబడ్డారు. దాంతో ఎన్టీఆర్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు. జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అంటూ అభిమానులు తమ ఫేవరెట్ హీరో తో సెల్ఫీ దిగడానికి చాలా ఆత్రుత పడ్డారు.
https://mobile.twitter.com/MovieByteIn/status/1204268779053568001


ప్రస్తుతం ఈ అభిమానులు ఎన్టీఆర్ ఫోటోలని నెట్టింట షేర్ చేశారు. దాంతో అవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

https://mobile.twitter.com/Tarak_GirlsTeam/status/1204370675491688448

ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఒక విమానంలో గేమ్స్ ఆడుతూ... అతనికి సంబంధించిన ఒక వీడియోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. ఆ తర్వాత ఆ వీడియో ని ఫాన్స్ ట్విట్టర్ లో అప్లోడ్ చేసారు.

https://mobile.twitter.com/MegaStar_Online/status/1204047865800085504

మరింత సమాచారం తెలుసుకోండి: