పాపం నారా లోకేశ్.. ఏపీ అసెంబ్లీ సమావేశాలను పరిశీలించేవారికి ఇదే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే.. వైసీపీ నేతలు ఏదో ఒక రూపంలో నారా లోకేశ్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తీసుకురాకపోయినా.. ఏ సందర్భంలో నారా లోకేశ్ ప్రస్తావన వచ్చినా సరే ఏకేస్తున్నారు. విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీనికి తోడు మొన్నటి ఎన్నికల్లో నారా లోకేశ్ ఓడిపోవడం ఆయనకు మరీ శాపంగా మారింది.

 

అంబటి రాంబాబు, కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ... ఇలా ఒకరేమిటి.. అసెంబ్లీలో వైసీపీ నేతలంతా నారా లోకేశ్ ను ఆడేసుకుంటున్నారు. విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు. మంగళగిరిలో ఆయన ఓటమిని పదే పదే గుర్తు చేస్తున్నారు. గతంలో నోరు తిరగక నారా లోకేశ్ చేసిన ప్రసంగాలను గుర్తు చేస్తున్నారు. ఒక్క మంగళవారం రోజే నారా లోకేశ్ ప్రస్తావన అసెంబ్లీలో చాలా సార్లు వచ్చింది.

 

వల్లభనేని వంశీ నారా లోకేశ్ ను మరోసారి పప్పు బ్యాచ్ అంటూ ఓ రేంజ్ లో విమర్శించారు. పేరు చెప్పకుండానే పప్పు బ్యాచ్ అంటూ లోకేశ్ పై కామెంట్ చేశారు. ఇక రోజా సంగతి తెలిసిందే.. అప్రయోజకుడైన కొడుకుని కని జనం మీద వదిలారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. లోకేశ్ కు మంగళగిరి అని కూడా అనడం రాదని.. వర్థంతికి జయంతికి తేడా తెలియదని మండిపడ్డారు.

 

ఇక మరో నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులో ఏదో తేడా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సభలో చంద్రబాబు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 25 ఏళ్ల కుర్రాడిలా ప్రవర్తిస్తే.. ఆయన కుమారుడు ప్రవర్తన 70 ఏళ్ల వ్యక్తిలా ఉందని ఎద్దేవా చేశారు. ఇలా ఎవరో ఒకరు.. ఎప్పుడో అప్పుడు.. నారా లోకేశ్ ను మాత్రం విపరీతంగా కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: