ఏమిటి ఈ గాడిద పంచాయతీ అని సాధారణంగా గ్రామాల్లో ఏదైనా గొడవలు జరిగినప్పుడు పెద్దలు  వాడుకునే ఊతపదం కానీ ఎక్కడ మాత్రం ఊతపదం కాదు గాడిద గురించే విచిత్ర  పంచాయతి ఇది  అసలు ఏమి జరిగింది అంటే కొన్ని రోజులక్రితం పారిపోయిన గాడిద నాది అంటే నాది అని  ఇద్దరు వ్యక్తులు పట్టుబట్టడంతో ఎటూ తేల్చలేక వికారాబాద్‌ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.ఈ వ్యక్తులు మరియు ఆ గాడిద పిల్లలు పీఎస్‌ చుట్టూ తిరుగుతున్నారు అని పోలీసులు తెలియచేసారు.

అసలు విషయానికి వస్తే వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని రామయ్యగూడలో నివాసం ఉండే బాణాల ప్రభు గాడిదల పాలను అమ్ముకొని జీవనం సాగిస్తుంటాడు. ఇతని వద్ద 22 గాడిదలు ఉండగా నాలుగు తప్పిపోయాయి.ఈ విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఒక్క సారి నవ్వుకొని పిర్యాదు చేసావు కదా గాడిదలను వెతికి పట్టుకొచ్చి ఇస్తామని పోలీసులు చెప్పారు.  పోలీసులకు పిర్యాదు చేసిన పోలీసులు గాడిదలను ఇలా పట్టుకోవాలి అని ఆ పిర్యాదుని వదిలేసారు కాబోలు అని ప్రభు వెతకడం మొదలుపెట్టాడు ఇటీవల మోమిన్‌పేటలో ఓ వ్యక్తి వద్ద తన గాడిద ఉన్నట్లు గుర్తించిన ప్రభు దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

దీంతో పోలీసులు ఆ  గాడిదను వికారాబాద్‌ పీఎస్‌కు తీసుకొచ్చారు. ఆ గాడిద ను చుసిన ప్రభు తనదేనని అలాగే  పద్మ అనే మహిళ తన తండ్రి సత్తయ్యతో కలిసి పీఎస్‌కు చేరుకొని వారు కూడా ఆ గాడిద తమదేనని వాదించుకుంటుండగా  వీరిద్దరూ గాడిద నాదంటే నాదే అనడంతో ఏం చేయాలో తోచని పోలీసులు మరోసారి ఆ గాడిదను తీసుకొని స్టేషన్‌కు రావాలని పద్మ కు  చెప్పి పంపించారు. కానీ ఆ సమాధానానికి సంతృప్తి చెందని ప్రభు సిఐ కి పిర్యాదు చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఇక ఈ గాడిద పంచాయతి లో పోలీసులు  ఎలా న్యాయం చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: