దిశ సంఘటన ప్రతి ఆడపిల్లలనే గాక, వారి తల్లిదండ్రులను కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చాలు వారిని కన్నవారిలో ఒకటే భయం కనిపిస్తుంది. ప్రతి గడపలోను ఇదే ఆలోచన. నా బిడ్దను ఏదైన మగమృగం వచ్చి వేటాదుతుందో అని. కొంత మంది తల్లిదండ్రులైతే పాపం కంటిమీద కునుకు కూడా పట్టకుండా అల్లాడిపోతున్నారు తమ బిడ్దల భవిష్యత్తును ఊహించుకుని.

 

 

ఇకపోతే రేపిస్టులపై షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం.. ఎందుకంటే దేశంలో.. అత్యాచారాలు జరుగుతోన్న రాష్ట్రాల్లో.. మధ్య ప్రదేశ్ కూడా ఒకటి. దీంతో.. గత రెండేళ్లలో.. ఇక్కడ జరిగిన అత్యాచార నిందితులకు ఈ ప్రభుత్వం ఉరిశిక్షను అమలు చేసింది. ఏకంగా 28 మందిని ఉరి తీస్తున్నట్టు.. అధికారికంగా..  ప్రకటించింది. అంతేకాకుండా.. ఇకపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై కూడా కఠిన శిక్షలు అమలు పరుస్తామని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు అక్కడి ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు.

 

 

ఇకపోతే ఇలా జరగడానికి కారణం ‘దిశ’ ఘటన కూడా కావచ్చు అని అనుకుంటున్నారు.. ఇకపోతే షాద్‌నగర్‌లో కీచకుల చేతిలో అంత్యంత దారుణంగా.. హత్యాచారానికి గురైన.. దిశ ఘటనలో.. నిందితుల ఎన్‌కౌంటర్ అనంతరం.. దేశంలోని నేరాలు చేసిన వారికి ఉరిశిక్షలు అమలవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా… దిశ ఘటన హైదరాబాద్‌ వైపు చూసేలా చేసింది. అంతేకాకుండా.. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కూడా పలువురు ఎంపీలు ప్రస్తావించి, ప్రశంసించారు.

 

 

ఇక ఈ సమయంలోనే.. నిర్భయ ఘటన కూడా మరోసారి తెరపైకి వచ్చింది. వారికి కూడా ఈ నెల 16వ తేదీన ఉరిశిక్షను అమలు పరుస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైన కనీసం ఈ భయంతోఐనా ఆడవారి మీద దాడులు గాని అత్యాచారాలు గాని ఆగిపోతే మన ఆడపిల్లలను ఇలాగైనా మనమే కాపాడుకున్న సంతృప్తి అయినా మిగులుతుంది అంటున్నారు ఈ విషయం తెలిసిన జనం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: