ఏపీ ప్రభుత్వం సబ్సిడీ కింద ఒకరికి 1 కేజీ చొప్పున ఉల్లిపాయలను అందిస్తున్నారు. రోజురోజుకి ఉల్లిపాయల కష్టాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. రైతు మార్కెట్ల వద్ద రద్దీ ఎల్లవేళలా కొనసాగుతూనే ఉంది. మహిళలు ఉల్లిపాయలు కోసం గంటల కొద్ది నిలబడి కాళ్ల నొప్పులు వచ్చి నానాతిప్పలు పడుతున్నారు. రైతు బజారులలో ఇచ్చే సబ్సిడీ ఉల్లిపాయల కోసం రోజూ పనులు మానుకొని కిలోమీటర్ల మేరకు కేజీ ఉల్లిపాయల కోసం గృహిణిలు నిలబడి కాళ్లు నొప్పులు వస్తున్నాయని భగ్గుమంటున్నారు.

 

కౌంటర్లు పెంచి.. వారానికి మూడు కేజీల ఉల్లిగడ్డలు ఇస్తే బాగుంటుందని వయసు పై బడ్డ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈజిప్ట్ నుంచి 6వేల టన్నుల ఉల్లిగడ్డలను ప్రభుత్వం కొన్ని రోజుల్లో దిగుమతి చేస్తుంది. దాంతో ఉల్లిపాయల ధరల తెలుగు రాష్ట్రాల్లో బాగా తగ్గనున్నాయని సమాచారం.

ఇక వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లాలో బయట మార్కెట్లలో కేజీ ఉల్లిగడ్డల ధర రూ.150 వరకు ఉంది.కొన్ని రోజుల్లో ఉల్లి మరింత పెరగబోతుందని అక్కడి వ్యాపారులు అంటున్నారు. దాంతో నెల్లూరు ప్రజలు రైతు బజార్ల వద్ద క్యూ కట్టి ఉల్లిపాయలను కొనుగోలు చేస్తున్నారు. అయితే అలా కొన్నవారిలోని కొందరు.. ఉల్లి కేంద్రాలకు పలుమార్లు వచ్చి మళ్ళీ మళ్ళీ కొంటున్నారు.

 

దీంతో... ఉల్లిపాయలను అసలు కొననివాళ్ళుకు ఉల్లిని తాకే అదృష్టమే రావట్లేదు. అందుకే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఉల్లి కేంద్రం నిర్వాహకులు.. ఉల్లిపాయలను ఒక్కసారి కొన్న వారు మళ్ళీ రాకుండా ఉండేదుకు... ఎన్నికల్లో ఓటర్ల చేతి వేళ్ళకు సీర రాసినట్లుగా.. ఉల్లికేంద్రాల ఎదుట క్యూ లో నిల్చున్న ప్రజల చేతికి సిరా రాస్తున్నారు. దీంతో ఈ నిర్వాహకులు పాటిస్తున్న విచిత్రమైన సిరా గుర్తు విధానం గురించి నెట్టింట చర్చియనీయంశం అయింది. మిగతా ఉల్లి కేంద్ర నిర్వాహకులు ఎటువంటి విచిత్రమైన విధానాన్ని పాటించి వార్తల్లో నిలుస్తారో చుడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: