ఏపీ అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధాలు జోరుగా సాగుతున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కేంద్రం నిధులతో పథకం ఇస్తూ జగన్ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. గణాంకాలతో సహా వివరిస్తూ చంద్రబాబుపై ఎదురు దా డి చేశారు. మొత్తం మీద ఈ విషయం అనవసరంగా ప్రస్తావించేనేమే అనే పరిస్థితి చంద్రబాబు కల్పించారు.

 

వాస్తవంలోకి వస్తే.. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు బేషరతుగా రుణమాఫీ అన్నారు. అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కుటుంబంలో ఒక్కరికే ఇస్తా. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే ఇస్తా. లక్షా యాభై వేలిస్తా. 5 విడతలుగా ఇస్తా అన్నారు. చివరకు మూడు విడతలు కూడా సక్రమంగా ఇవ్వకుండా అధికారం నుంచి వెళ్లిపోయారు.

 

జగన్, చంద్రబాబు.. ఇద్దరు నాయకుల పాలన గురించి తేడా గమనిస్తే రైతులెప్పుడూ చంద్రబాబుకు ఓటు వేసే పరిస్థితి లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. ఎందుకంటే వర్షాలు పడవని. కానీ రైతు రుణమాఫీ అన్నాడు కదా చేస్తాడని వేసారు. కానీ అధికారంలోకి వచ్చాక బాబు రెండు వేళ్లు చూపించి, మూడు నామాలు పెట్టి వెళ్లిపోయాడని గుర్తు చేస్తున్నారు.

 

అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు వైయస్సార్ రైతు భరోసా 4 విడతలుగా రూ.12,500 చొప్పున రూ.50000 ఇస్తామని చెప్పారు. దానికి మరో రూ.1000 పెంచి రూ.13,500 ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రి మాట చెప్పి మోసగిస్తే, ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పినదానికంటే ఎక్కువ ఇచ్చి తన ఘనత చాటుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. నాలుగు విడతల్లో రూ.50,000 అన్న రైతుభరోసాను మరో విడత పొడిగించి 5 విడతలు చేసి, మొత్తం రూ. 67,500 అందిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: