పౌరసత్వ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రతిపక్షాల సంఖ్య పెరిగినప్పటికీ, ప్రతిపాదిత చట్టాన్ని బుధవారం రాజ్యసభ మెజారిటీతో ఆమోదిస్తుందని బిజెపి నమ్మకంగా ఉంది. ఈ నేపథ్యంలో, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ వర్గాలు ఎగువ సభలో 124-130 ఓట్లు తమకు రావడం ఖాయం అని, 240 మంది సభ్యుల సభలో ప్రతిపక్షాలు 90-93 ఓట్లను దాటడానికి అవకాశం లేదని ఎన్‌డిఎ వర్గాలు తెలిపాయి.

 

ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి బిల్లును వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్ష ఓట్లు ఆరు పెరిగాయి. ఇక అలాగే ఇప్పుడు కాంగ్రెస్-ఎన్‌సిపి కూటమిలో భాగస్వామి అయిన దీర్ఘకాల బిజెపి మిత్రపక్షమైన శివసేన కూడా లోక్‌సభలో బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాత రాజ్యసభలో మద్దతు ఇవ్వకపోవచ్చని సమాచారం. హిందుత్వ ఎజెండాను అనుసరించిన చరిత్ర కలిగిన శివసేన పార్టీకి రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. 

 

బిజెపి మిత్రపక్షాలైన ఎఐఎడిఎంకె, జెడి (యు), అకాలీదళ్ పార్టీలకు ఎగువ సభలో వరుసగా పదకొండు, ఆరు, ముగ్గురు సభ్యులు ఉన్నారు, వీటితో పాటుగా ఏడుగురు ఎంపిలతో బిజెడి, వైయస్ఆర్ కాంగ్రెస్ మరియు టిడిపికి 2 చొప్పున రాజ్యసభ సభ్యులు ఉండగా వీరు బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. రాజ్యసభలో బిజెపికి 83 మంది సభ్యులు ఉన్నారు. ఏడుగురు స్వతంత్రులు, నామినేటెడ్ సభ్యులు మరియు అనేక ప్రాంతీయ పార్టీలలో ఒక్కొక్క సభ్యుడు ఈ బిల్లుకు మద్దతు ఇస్తారని బిజెపి ఫ్లోర్ మేనేజర్లు తెలిపారు.

 

ప్రతిపక్ష శిబిరంలో కాంగ్రెస్, టిఎంసి, బిఎస్పి, సమాజ్ వాదీ పార్టీ, ఆర్జెడి, వామపక్ష, టిఆర్ఎస్ పార్టీలు వరుసగా నలబై ఆరు, పదమూడు, నాలుగు, తొమ్మిది, నాలుగు, ఆరుగురు సభ్యులతో ఉన్నాయి, మొత్తంగా చూస్తే ప్రతిపక్షాలకు 88 సభ్యులు ఉన్నారు. శివసేన మద్దతు వస్తే మరియు కొన్ని చిన్న పార్టీలు మద్దతు ఇచ్చినా ఈ సంఖ్య 90 కి పైగా దాటే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వానికి పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదింప చేసుకునే క్రమంలో పెద్దగా అసౌకర్యాన్ని ఎదుర్కునే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: