దేశంలోనే సీనియర్ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు లాజిక్ లేకుండా అసెంబ్లీలో మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ కేంద్రం సొమ్ముతో ఏపీలో పథకాలు అమలు చేస్తూ మోసం చేస్తున్నారని చంద్రబాబు చేసిన ఆరోపణలను వైసీపీ నేతలు తిప్పుకొడుతున్నారు.

 

రైతు భ‌రోసాలో రూ.6 వేలు కేంద్ర నిధులు అని చంద్రబాబు అంటున్నారని.. బ‌డ్జెట్‌ ప్రవేశ‌పెట్టిన‌ప్పుడు కేంద్ర నిధులు క‌లుపుకొని బ‌డ్జెట్ రూపొందిస్తామ‌ని తెలియ‌దా అని

మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి నిల‌దీశారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో కేంద్ర నిధులను ఉప‌యోగించుకుంటున్నామ‌న్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ గృహ స‌ముదాయం ప‌థ‌కానికి ఎవ‌రి డ‌బ్బు ఉప‌యోగించారని మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి ప్రశ్నించారు.

 

ఆ సొమ్ము..రాష్ట్రానిదా.. కేంద్రనిదా..? దీనికి చంద్రబాబు స‌మాధానం చెప్పాల‌ని మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి ప్రశ్నించారు. చంద్రన్నబాట‌, పెన్షన్లు, ప్రతి ఒక్కదాంట్లో కేంద్ర నిధులు ఉన్నాయ‌న్నారు. కానీ పేరు మాత్రం చంద్రన్న పేరు పెట్టుకున్నాడ‌ని మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి ఎద్దేవా చేశారు. రైతుల‌కు అన్ని ర‌కాలుగా మేలు జ‌ర‌గాలి. 2014 ఎన్నిక‌ల్లో ఎటువంటి హామీలు ఇచ్చారు. రైతుల‌కు సంబంధించి రుణ‌మాఫీ చేస్తాన‌ని అధికారంలోకి వ‌చ్చిన చంద్రబాబు ఎంత‌మేర‌కు రైతుల‌కు న్యాయం చేశారని ఆయన ప్రశ్నించారు.

 

రూ.87 వేల కోట్లు రైతుల బ‌కాయిలు.. దాన్ని నీరుగార్చి రూ.24 వేల కోట్లకు కుదించారు. అది కూడా ఇవ్వలేదు. రైతు సాధికారిత సంస్థ‌, రుణ ఉప‌శ‌మ‌న అర్హత ప‌త్రం. ఒక రైతుకు రూ.1.29 ల‌క్షలు ఇస్తాన‌ని రుణ‌ప‌త్రం ఇచ్చాడు. ఇలాంటి కాగితాలు కొన్ని ల‌క్షల ప‌త్రాలు ఉన్నాయి. వీటిని వాళ్లు ఏం చేసుకోవాలో చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఐదేళ్లలోనే పూర్తిచేయాలి. త‌రువాతి ప్రభుత్వాలు ఇస్తాయ‌ని చెబుతారా..? అంటూ మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి చంద్రబాబును కడిగిపారేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: