తెలంగాణలో ఆర్టీసీ చార్జీలను పెంచటం, అమలు చేయటం జరిగింది. ఇప్పుడు ఏపీలో కూడా ఏపీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది  ఛార్జీలను పెంచుతున్నట్లు ... తాజాగా పెంచిన ఛార్జీలను బుధవారం (11-12-2019) నుంచి అమలు చేయనున్నారు. పల్లె వెలుగులో కి.మీకు 10 పైసలు.. ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీలో కి.మీకు 20 పైసలు.. ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కి.మీకు 10 పైసలు ఛార్జీలు పెరిగాయి. వెన్నెల స్లీపర్ బస్సుల్లో ఛార్జీలు యధాతథంగా ఉంటాయి.. సిటీ ఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపు లేదు. పల్లె వెలుగులో మొదటి 2 స్టేజీలు, 10 కి.మీ వరకు ఛార్జీలు పెంచలేదు. 


ఏపీఎస్ ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందని.. సంస్థను గట్టెక్కించాల్సిన అవసరం ఉందని.. అందుకే ఛార్జీలు పెంచాల్సి వస్తోందని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీకి రూ.6735 కోట్ల అప్పులున్నాయని.. ఏటా ఆర్టీసీకి రూ.1200 కోట్ల నష్టాలు వస్తున్నాయని.. నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడేందుకే చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

 

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే పెంచిన ఛార్జీలు అమలవు కావడం ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై ప్రతిపక్షం టీడీపీ అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంది.. దీనిపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇస్తుందన్నది చూడాలి. కాగా  నిన్నటి సభలోనే సభ్యుల వాదనలు ప్రతి వాదనలతో సభ దద్దరిల్లింది ఈ రోజు పెరిగిన చార్జీలపై ఎలా ఉండబోతోందో.... ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీకి ఏటా రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టాలు వస్తున్నా.. నాలుగేళ్లుగా చార్జీలు పెంచలేదని.. భారీ నష్టాలు, పెరుగుతున్న డీజిల్‌ ధరల నేపథ్యంలో చార్జీలు పెంచాలని ఆర్టీసీ ఎప్పటి నుంచో కోరుతోంది.

 

సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ చార్జీల పెంపు పై నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిత్యావసరాలపైనే కాకుండా అనేక రకాలుగా ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా చార్జీల పెంపు ప్రకటన ఉందని ఎద్దేవా చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: