దిశ ఎన్  కౌంటర్ పై  తెలంగాణ సీఎం కేసీఆర్ ను అభినందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ వేదిక గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  చేసిన  వ్యాఖ్యలు  కేసీఆర్ కు న్యాయపరమైన  చిక్కులు తెచ్చిపెట్టనున్నాయా ? అంటే అవుననే న్యాయనిపుణులు అంటున్నారు .  అసెంబ్లీ సమావేశాల తొలిరోజు చర్చలో భాగంగా దిశ నిందితుల్ని  ఎన్ కౌంటర్  చేసిన తెలంగాణ పోలీసుల్ని , ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్ అభినందించిన విషయం తెల్సిందే .  దిశ నిందితుల  ఎన్ కౌంటర్ పై  ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ గా ఉంది.  ఈ నేపధ్యం లో జగన్ అసెంబ్లీ వేదిక గా చేసిన వ్యాఖ్యల ద్వారా , ఇది బూటకపు ఎన్ కౌంటరే నన్న  విషయాన్ని అయన చెప్పకనే చెప్పినట్లయింది న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు . 

 

 మీడియా లో వచ్చిన వార్తల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం , ఎన్ కౌంటర్ పై పూర్తి నివేదికను అందజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఈ కేసులో పోలీసులను విచారించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు . దిశ నిందితు లది బూటకపు ఎన్ కౌంటర్ అన్న వాదనలు విన్పిస్తున్న తరుణం లో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ను అభినందిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు , ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూర్చేవిగా ఉన్నాయని అంటున్నారు . దాంతో కేసీఆర్ మెడకు న్యాయపరమైన చిక్కులు చుట్టుకునే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు .

 

దానికితోడు నిందితులు ఇద్దరు మైనర్లే కావడం వల్ల , వారి పదవ తరగతి మెమో లో ఉన్న పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుని, మైనర్లని నిర్ధారణ అయితే మాత్రం  పోలీసులకు చిక్కులు తప్పకపోవచ్చునని అంటున్నారు,  ఈ ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి పేర్కొంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: