ఉల్లి ధరల విషయంలో.. ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ వ్యవసాయ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. సోమవారం.. ప్రతిపక్షం చేసిన ఆందోళన, పోడియం వద్దకు వచ్చి వారు మాట్లాడిన మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఉల్లిపాయలకోసం జరిగిన తొక్కిసలాటలో మరణం జరిగిందని అబద్ధాలు ప్రచారం చేసి సభను తప్పుదారి పట్టించినందుకు చంద్రబాబుక్షమాపణ చెప్పి తీరాలని కన్నబాబు డిమాండ్ చేశారు.

 

కన్నబాబు ఇంకా ఏమన్నారంటే.. ” ఈమధ్యన ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక రాజకీయ అవకాశం కోసం ఎదురుచూస్తూ మొన్న ఇసక ప్యాకెట్లు దండ మెళ్లో వేసుకుని రోడ్లమీదకొచ్చారు. నిన్న ఉల్లిపాయల దండలేసుకుని అసెంబ్లీకొచ్చారు. ఉల్లిపాయల కోసం వినియోగదారులు చనిపోయారని గొడవ చేసారు. నిజం ఏంటని ఆరా తీస్తే ఆ వ్యక్తి చనిపోయింది వేరే కారణాలవల్ల అని ఆ కుటుంబ సభ్యులు చెప్పారు.

 

ఎక్కడో జరిగిన సంఘటనను తెచ్చి ఉల్లిపాయలకు లింక్ చేసి, కీలకమైన మహిళా బిల్లుపై జరిగే చర్చను పక్కదారి పట్టించిన నీచ రాజకీయాలు ప్రతిపక్ష టీడీపీ చేస్తోందన్నారు మంత్రి కన్నబాబు. సీఎంగారు వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసి ఛైర్మన్ ను నియమించిన విషయాన్ని కన్నబాబు గుర్తు చేశారు. క్రమం తప్పకుండా ప్రతి నెలా మీటింగ్ నిర్వహిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ మీద ఫస్ట్ ఎజెండా ఐటమ్ గా ఆయనే రివీల్ చేస్తున్నారు.

 

నాలుగు నెలల క్రితం వ్యవసాయ మిషన్ కమీషన్ మీటింగ్ లో చర్చించిన ఎజెండాలో సీఎం చెప్పిన విషయం ఏమిటంటే - ఏ వ్యవసాయ ఉత్పత్తికైనా ఫ్లోర్ కాస్ట్ ఉండాలి. రాబోయే 3 నెలల్లో ఏ సమస్యలు రాబోతున్నాయి, వాటిని అధిగమించేందుకు మనం అనుసరించబోయే విధానం ఏమిటి, ఎలాంటి ప్రిపరేషన్ ఏమిటీ అన్న విషయాలపై చర్చించారని కన్నబాబు అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: