ఉల్లి బాంబు.. ఇప్పడు దేశమంతా ఈ బాంబు పేలుతోంది. దేశంలో ఎక్కడ చూసినా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. కిలో 150 వరకూ రేటు పలుకుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఇప్పుడు ఇదే లొల్లి.. కానీ అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఉన్నా.. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని ప్రజలకే వదిలేశారు. వారి కష్టాలు వారు పడతారని లైట్ గా తీసుకున్నారు.

 

కొన్ని రాష్ట్రాలు మాత్రం రాయితీ ధరతో ఉల్లి ప్రజలకు అందిస్తున్నాయి. అలాంటి రాయితీ ఉల్లి అందించే రాష్ట్రాల్లో ఏపీ అగ్రభాగాన నిలుస్తోంది. బహిరంగ మార్కెట్లో కేజీ 150 రూపాయల వరకూ ఉంటే.. ప్రభుత్వం ఆభారం భరించి కేవలం 25 రూపాయలకే కేజీ ఉల్లి ఇస్తోంది. ఇలా తక్కువ ధరకు ఉల్లి అందిస్తున్న సీఎంగా జగన్ రికార్డు సాధించారు.

 

ఉల్లి వేసేప్పుడు వర్షాభావం వల్ల, తీసే సమయానికి అధిక వర్షాల వల్లా నష్టం జరిగి ఉల్లి ఉత్పత్తి తగ్గిపోయింది. నేడు వినియోగదారుడికి ఉల్లి భారం కాకుండా ఉండేందుకు సగటున కేజీకి రూ.100 సబ్సిడీ ఇచ్చి రైతు బజారులో అమ్మిస్తున్నారు. నేటి పరిస్థితుల్లో దేశంలోని ఏ రాష్ట్రమైనా వినియోగదారుడికి ఉల్లిపాయల మీద రూ.100 సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేదు. ఒక్క ఏపీలో తప్ప.

 

ఏపీ పక్కనేఉన్న తెలంగాణాలోనూ కేజీ రూ.45 రూపాయిలకు రైతు బజార్లో అమ్ముతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే.. వాలంటీర్లతో ఇంటింటికీ ఉల్లిపాయలు సరఫరా చేయమని ప్రతిపక్ష సభ్యులు కోరుతున్నారు. కోటిన్నర కుటుంబాలకు ఉల్లిపాయ సప్లై చేయాలంటే 15000 టన్నులు ఉల్లి కావాలి. రోజుకు 3000 టన్నుల ఉల్లి అవసరం అవుతుంటుంది. కర్నూలు, తాడెపల్లి గూడెం మార్కెట్లు ఏపీకి మెయిన్. వాటి నుంచి ఉల్లి పక్క రాష్ట్రాలకు తరలిపోకుండా నిఘా ఏర్పాటు చేసింది ఏపీ సర్కారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: