ఏపీ సీఎం జగన్ కేసీఆర్ కు కొరకరాని కొయ్యగా మారుతున్నారు. సంక్షేమ పథకాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టింది పేరు. ఆయన సీఎం అయ్యాక రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆ మంచి పేరుతోనే ఎంత మంది ఏకమైనా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారం చేపట్టారు. కానీ ఆ తర్వాత ఏపీలో ఎన్నికలు జరిగి జగన్ సీఎం అయ్యాక సీన్ క్రమంగా మారుతోంది.

 

అప్పులతో ఉన్న రాష్ట్రం అయినా ఏపీ సీఎం జగన్ ఎక్కడా తగ్గకుండా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణలతో పోటీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. తెలంగాణలో లేనివి కూడా ఏపీలో చాలా పథకాలు అమలవుతున్నాయి. ఇలా క్రమంగా కేసీఆర్ కు జగన్ కొరకరాని కొయ్య అవుతున్నారు. తాజాగా జనం ఉల్లి సమస్యతో బాధపడుతుంటే.. జగన్ కేవలం 25 రూపాలకే ఉల్లి అందిస్తున్నారు.

 

యద అందాలన్నీ బయటికే కనిపిస్తుంటే.. ఇంకా ఆ టాప్ ఎందుకు యాషికా..?

 

ఇప్పుడు ఇది కేసీఆర్ కు సమస్యగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం కూడా రాయితీపై ఉల్లి అందిస్తోంది. కాకపోతే.. తెలంగాణలో ఉల్లిధర ఏపీ కంటే చాలా ఎక్కువ. దాదాపు డబల్ రేటుకు కేసీఆర్ రాయితీ ఉల్లి ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా జగన్ రాయితీ ఉల్లి గురించి చెప్పుకుంటున్నారు. మరోవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశారు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఇష్యూ హైలెట్ అవుతోంది.

 

ఏపీ అసెంబ్లీ తాము చేసిన కార్యక్రమాల గురించి మంత్రులు చెబుతున్నారు. ఉల్లి విషయం ప్రస్తావిస్తూ.. సగటున కేజీకి రూ.100 సబ్సిడీ ఇచ్చి రైతు బజారులో అమ్మిస్తున్నారని అంటున్నారు. నేటి పరిస్థితుల్లో దేశంలోని ఏ రాష్ట్రమైనా వినియోగదారుడికి ఉల్లిపాయల మీద రూ.100 సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఎక్కడైనా ఉందా? అని వైసీపీ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. పక్కనేఉన్న తెలంగాణాలోనూ కేజీ రూ.45 రూపాయిలకు రైతు బజార్లో అమ్ముతున్నారని గుర్తు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: