దేశవ్యాప్తంగా ఉల్లి సమస్య తీవ్రంగా ఉంది. కేజీ 150 రూపాయలకుపైగా ధర ఉంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఇప్పుడు ఇదే లొల్లి.. అన్ని రాష్ట్రాల్లో ఈ సమస్య ఉన్నా.. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని ప్రజలకే వదిలేశారు. ఏపీలో జగన్ మాత్రం రాయితీ ద్వారా ఉల్లి అందిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కేజీ 150 రూపాయల వరకూ ఉంటే.. ప్రభుత్వం ఆభారం భరించి కేవలం 25 రూపాయలకే కేజీ ఉల్లి ఇస్తోంది.

 

రాష్ట్రంలోని 101 రైతుబ‌జార్ల ద్వారా ఉల్లిపాయ‌లు కేజీ రూ.25కే విక్రయాలు జ‌రుపుతున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు ఇత‌ర రాష్ట్రాలు, దేశాల నుంచి మార్కెట్ ఇంట్ర‌వెన్ష‌న్ ఫండ్ ద్వారా అధిక ధ‌ర‌ల‌కు ఉల్లిని కొనుగోలు చేసి రైతుబ‌జార్ల ద్వారా కిలో రూ.25కే అందిస్తున్నారు. అయితే ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. మంచి చేస్తే ఆ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి.

 

యద అందాలన్నీ బయటికే కనిపిస్తుంటే.. ఇంకా ఆ టాప్ ఎందుకు యాషికా..?

 

కానీ ఇక్కడ సీన్ అలా లేదు. కేజీ ఉల్లి రూ. 25కే అందిస్తున్నందువల్ల జనం బారులు తీరుతున్నారు. అలా బారులు తీరినప్పుడు ఉల్లి సరఫరాకు చాలా సమయం పడుతుంది. సహజంగానే క్యూలో ఉన్నవారికి కోపం వస్తుంది. అక్కడక్కడా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఇప్పుడు ఎల్లో మీడియా వీటినే హైలెట్ చేస్తోంది. ఉల్లి సమస్య కేవలం ఏపీలోనే ఉన్నట్టు బిల్డప్ ఇస్తోంది.

 

అంటే ప్రభుత్వం పూనుకుని ప్రజలకు మేలు చేయాలని.. రాయితీకి ఉల్లి ఇవ్వాలని భావించి తక్కువ ధరకు నష్టం భరించి అమ్ముతుంటే.. ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోంది అన్న లెవల్లో ఎల్లో మీడియా ప్రజంటేషన్ ఉంటుంది. అదే ఈ ఉల్లి సమస్యను మిగిలిన రాష్ట్రాల్లో లాగనే జనానికి వదిలేసి ఉంటే.. అప్పుడు ఎల్లో మీడియాకు బావుండేదేమో..

 

మరింత సమాచారం తెలుసుకోండి: