ఈ మద్యకాలంలో ప్రైవేట్ స్కూళ్లంటే ఫీజులకు మాత్రమే గొప్ప. వేయిల వేయిలకు ఫీజులు వసూలు చేస్తూ బండెడు హోంవర్క్‌లు, గాడిదలా మోయలెనంత పుస్తకాల బరువులు లేత భుజాలపై మోపుతున్నారు. ఇప్పుడు చదువు 'కొనే' పరిస్దితిలో మనం బ్రతుకుతున్నాము. ఇలాంటి చదువుల వల్ల భావితరాలు బాగుపడతాయా? అని ప్రశ్నిస్తే ఈ చదువుల వల్ల పిల్లల్లో మానసిక పరిపక్వత పూర్తిగా లోపిస్తుంది.

 

 

ఇప్పటి చదువులు సమాజంలో పెద్ద ఉద్యోగాలు సంపాదించు కోవడానికే ఉపయోగపడతాయి గాని మనుషులను మనుషుల్లా మాత్రం బ్రతకడానికి పనికిరావు అనే అభిప్రాయం వెల్లడవుతుంది. ఇకపోతే చిన్న పిల్లలనుండి పదవ తరగతి కాని ఇంకా ఆ పై చదువులకు గాని  ఒత్తిడితో కూడిన చదువులే చెబుతున్నారు గాని అవి వారి మెదడులో ఎంతవరకు నిక్షిప్తమవుతున్నాయని ఆలోచించడంలేదు ఉపాద్యాయులు. చిన్నప్పటి నుండే వారి లేత మనసు పై మోయలేనంత భారం వేసి పిల్లలను యంత్రాల్లా తయారు చేస్తున్నాయి ఇప్పటి స్కూల్స్. ఇకపోతే నాలుగో తరగతి విద్యార్థిని ముఖంపై నల్ల రంగు పూసి.. అందరూ చూస్తుండగా పాఠశాల చుట్టూ తిప్పింది. ఓ ఉపాధ్యాయురాలు.

 

 

ఇలా ఎందుకు చేసిందంటే పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని. ఇలాంటి వారు టీచర్లుగా వ్యవస్దలో ఉండటం నిజంగా దురదృష్టం.  హరియాణాలోని హిసార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే. ఇక్కడ ఉన్న ఓ పాఠశాలలో ఈ నెల 5న నిర్వహించిన పరీక్షలో తమ కుమార్తెకు తక్కువ మార్కులు వచ్చాయని అక్కడి ఉపాధ్యాయురాలు ఆ పాప ముఖానికి స్కెచ్‌ పెన్‌తో నల్లరంగు అద్ది.. పాఠశాల చుట్టూ తిప్పారని ఆమె తండ్రి ఆరోపించారు.

 

 

4వ తరగతి చదివే తన కుమార్తెకు తొమ్మిదేళ్లని, ఆ వయసులో కనీసం ప్రశ్నకు జవాబు ఎలా రాయాలో కూడా తెలియదని పేర్కొన్నారు. అలాంటిది తక్కువ మార్కులు వచ్చాయన్న నెపంతో చిన్నారిని ఇలా హింసించడం దారుణమని. వెంటనే ఈ పాఠశాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు అదే పాఠశాలలో చదువుతున్న ఆరో తరగతి విద్యార్థి మాట్లాడుతూ.. అదే రోజు ఈ బాలికతో పాటు మరో ముగ్గురి పట్ల కూడా ఇలాగే వ్యవహరించినట్లు వెల్లడించాడు.

 

 

మార్కులు తక్కువ వచ్చాయంటూ నలుగురికీ ఉపాధ్యాయురాలు ముఖాన రంగు పులిమినట్లు వివరించాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇది ఎంత దారుణ ఘటన ఇలాంటి చర్యలు పిల్లల మనసుపై పడి వారిని మానసికంగా కృంగిపోయేలా చేస్తాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నా ఇలాంటి ఘటనలు ఇంకా అక్కడక్కడ జరగడం మన వ్యవస్దలో ఉన్న లోపాన్ని చూపుతుందంటున్నారు కొందరు..

మరింత సమాచారం తెలుసుకోండి: