ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజే వేడెక్కాయి. సవాళ్లు ప్రతిసవాళ్లు విసుకునే పరిస్థితులు తలెత్తాయి. ప్రధానంగా ప్రతిపక్షనేత చంద్రబాబు, సీఎం జగన్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. ఉల్లి ధరలు, సన్నబియ్యంపై జరిగిన చర్చ చివరకు సవాళ్లకు దారి తీసింది. హెరిటేజ్ ప్రెష్ లో తమది కాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు.

 

ఉల్లిధరల విషయమై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ లో ఉల్లి ధర 200 ఉందని జగన్ ప్రస్తావించారు. దీనికి చంద్రబాబు కూడా ఘాటుగానే స్పందించారు. జగన్ కు సవాల్ విసిరారు. తమకు హెరిటే.జ్ ప్రెష్ తో సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని తాను మీడియాతో చెప్పానని , అయినా జగన్ ఈ విషయం చెబుతున్నారని, దమ్ముంటే సవాల్ విసురుతున్నానని అన్నారు.

 

యద అందాలన్నీ బయటికే కనిపిస్తుంటే.. ఇంకా ఆ టాప్ ఎందుకు యాషికా..?

 

హెరిటేజ్ ఫ్రెష్ లో తమకు వాటా ఉందని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని, ఎమ్మెల్యే పదవికి, ప్రతిపక్ష పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబు సవాల్ విసిరారు. అదే సమయంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి .. లేలేయ్, చెప్పు.. మోసాలు చేయడం కాదు.. అంటూ ఎద్దేవా చేశారు. జగన్ ను కవ్వించారు.

 

ఆ సమయంలో జగన్ నవ్వుతూ కనిపించారు. ఇక అదే సమయంలో మంత్రి కొడాలి నాని అందుకున్నారు. చంద్రబాబు గుడివాడ లో జరిగిన మరణం పై చేసిన రాజకీయాన్ని పక్కదారి పట్టించేయత్నం చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. ఆ తర్వాత ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబుకు సమాధానం చెప్పారు.

 

బిజెనెస్ స్టాండర్డ్ పత్రిక ను కోట్ చేశారు. హెరిటేజ్ ప్రెష్ లో 6.8 శాతం వాటాను అమ్మినట్లు ఆ పత్రికలో రాసిన విషయాన్ని చదివి వినిపించారు. మరి పత్రిక కథనం ప్రకారం చంద్రబాబుకు వాటా ఉన్నట్లా? లేనట్లా? అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. మరి ఇంతకీ.. చంద్రబాబుకు హెరిటేజ్ లో వాటా ఉన్నట్టా లేనట్టా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: