గుడివాడలో ఉల్లి కోసం క్యూలో నిలబడి సాంబిరెడ్డి అనే వ్యక్తి మరణిండాన్న వార్త సంచలనం సృష్టించింది. ఈ వార్తను ప్రముఖ దిన పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు ప్రముఖంగా ప్రచురించాయి. తమ మాధ్యమాల్లో ప్రసారం చేశాయి. అయితే అది వాస్తవం కాదని మంత్రి కొడాలి నాని అంటున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ఆయన ఓ వీడియో ప్రదర్శించారు.

 

తమకు ఉల్లి కోసం క్యూలో నిలబడవలసిన అవసరం లేదని సాంబిరెడ్డి కుటుంబం చెప్పిందట. దీనికి సంబంధించిన వీడియోను కొడాలి నాని అసెంబ్లీలో ప్రదర్శించారు. ఆ తర్వాత మీడియాతో కూడా సాంబిరెడ్డి కుమారుడు, బావమరిది మాట్లాడారని.. కానీ ప్పుడు అక్కడకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వెళ్లలేదని కొడాలి నాని చెప్పారు. రాష్ట్రం అంతా తన జాగీరు అని చంద్రబాబు అనుకోవచ్చని, కాని అది గుడివాడ అని... అక్కడ ఉన్నది కొడాలి నాని అని మంత్రి కామెంట్ చేశారు.

 

యద అందాలన్నీ బయటికే కనిపిస్తుంటే.. ఇంకా ఆ టాప్ ఎందుకు యాషికా..?

 

గుడివాడలో రైతు బజార్ వద్ద సాంబిరెడ్డి అనే వ్యక్తి మరణించాడు. ఉల్లి కోసం వెళ్లి ఒకరు మరణించారని ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా ప్రముఖంగా ప్రచారం చేశాయి. అయితే అంతే కాకుండా.. ఈ రెండు పత్రికల డెస్క్ ఇన్చార్జీలు ఆ కుటుంబం వారికి ఫోన్ చేశారట. ఉల్లి కోసం వెళ్లి సాంబిరెడ్డి మరణించాడని చెప్పాలని అన్నారట. అలా అయితే పాతిక లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తారని చెప్పారట.

 

అంతే కాదు.. అలా చెబితే... చంద్రబాబు వస్తారని అన్నారని మంత్రి కొడాలి నాని అసెంబ్లీలో వెల్లడించారు. అయితే అందుకు ఆ కుటుంబం అంగీకరించలేదట. తమను రాజకీయాల్లోకి లాగవద్దని తిరస్కరించారట. అంతే కాదు.. తమకు ఉల్లి కోసం క్యూ లైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదని చెప్పారట. అంటే ప్రముఖ పత్రికలు అబద్దం చెప్పిట్టేగా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: