ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు గురించి వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న రాజ్యసభలో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పోలవరం పునరావాస ప్యాకేజీ కోసం ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులకు చెల్లించవలసిన అలాగే పున నిర్మాణ పనుల కోసం తక్షణమే 16 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

 నీటి లభ్యత కోసం జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని ఆయన మంగళవారం రాజ్యసభ జరిగిన చర్చలో మాట్లాడారు. పోలవరం ముంపునకు గురయ్యే గ్రామాలను నుంచి వేలాది మంది కుటుంబ ఇప్పటికే ఖాళీ చేయించడం జరిగింది. వారందరికీ పునరావాసం కల్పించాలి, అలాగే పునర్నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టాలి. దీని కోసం సవరించిన అంచనాల వేసి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీర్ పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖను గుర్తు చేస్తూ 16 వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు.

 

 ఇంత ముందు సవరించిన అంచనాల తో రూపొందించిన డిపిఆర్ఓ కేంద్ర జలసంఘం ఆమోదించింది. ఆ తర్వాత ఆమోదం కోసం ఆ ఫైలును కేంద్ర ఆర్థిక శాఖకు పంపించారు. దీనిపై తగిన చర్యలు, సిఫార్సు చేయాలని రివైజ్డ్ కమిటీని వేసింది. ఏపీ ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు 2021 నాటికి పూర్తి చేయాలని సంకల్పంతో ఉండాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

 

అందువలన సవరించిన అంచనా వ్యయంకు సంబంధించిన డీపీఆర్ను జాప్యం లేకుండా ఆమోదించాలి. అలాగే నిధుల విడుదల కూడా త్వరితగతిన జరగాలి. నిధుల విడుదల సాఫీగా జరిగేందుకు జల శక్తి మంత్రిత్వ శాఖ వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా అని కూడా ఆయన ఆరా తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: