పార్లమెంట్ సభలో ఎప్పుడు చూడని ఒక వింత ఈ శీతాకాల సమావేశాల్లో జరిగింది. సాధారణంగా ఏ బిల్లు అయినా లోక్ సభ కాని రాజ్య సభలో కాని ప్రతిపాదిస్తే కచ్చితంగా దానికి అనుకూలంగా పడే ఓట్లు ఉంటాయి, అలాగే వ్యతిరేకించే ఓట్లు కూడా ఉంటాయి. కొన్నిసార్లు అనుకూలమైన ఓట్లు తక్కువ ఈ బిల్లు ఆగిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అలాంటి సమయంలోనే అధికార పార్టీలు మిత్ర,ప్రతి పక్ష పార్టీలను బుజ్జగించి ఓట్లు వేయించుకొని తమ పని కానిస్తుంది. భారతీయ వ్యవస్థలో ఇది సహజమైన ప్రక్రియ.

 

 కానీ కొన్ని బిల్లులు మాత్రం అందరి అనుమతితో పాస్ అవుతూ ఉంటాయి. ఇదే క్రమంలో బిల్ పాస్ అయినా కూడా కొన్ని పార్టీలను ఏదో ఒక బిల్లుని వ్యతిరేకిస్తూ వస్తాయి. కానీ, తాజాగా లోక్ సభలో ఒక బిల్లు ఎలా పాస్ అయింది అంటే. ఒక్కటంటే ఒక్క ఓటు కూడా దానికి వ్యతిరేకంగా పడకుండా ఆ బిల్లు పాస్ అయింది. అది ఏంటి అంటే ఎస్సీ- ఎస్టీ- ఆంగ్లో-ఇండియన్ పొలిటికల్ రిజర్వేషన్.

 

నిన్ను లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు దేశంలోని అన్ని పార్టీలు మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో దళితులకు - గిరిజనులకు - ఆంగ్లో ఇండియన్లకు ఆ రిజర్వేషన్లను పెంచింది కేంద్ర ప్రభుత్వం. మరో పదేళ్ల పాటు  పొలిటికల్ రిజర్వేషన్లను పెంచారు. మొత్తం 352 మంది ఈ ఓటింగ్ లో పాల్గొనగా అన్ని ఓట్లూ ఆ బిల్లుకు అనుకూలంగానే పడ్దాయి.

 

 ఈ బిల్లు ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. దీనితో వాళ్ళు పోటీ చేయడానికి కొన్ని నియోజకవర్గం రిజర్వు చేసే నియమాన్ని అమలులోకి వస్తుంది. రాజ్యాంగం రాసినప్పుడు ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో 75 సంవత్సరాలపాటు ఆ రిజర్వేషను ఉండేలాగా రాసుకున్నారు, ఆ గడువు వచ్చే ఏడాది తో పూర్తవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: