ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు ఇంకా ఎన్నో వినూత్న పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతుంది అన్ని వర్గాలకు సమన్యాయం చేసి సుపరిపాలన అందిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నింటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతుంది జగన్మోహన్రెడ్డి సర్కార్. ఈ క్రమంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.ఇక ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొన్ని రోజుల్లోనే ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. 

 

 

 

 ఇక తాజాగా ఆర్టీసీ కి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆర్టీసీ సంస్థ నిర్వహణ తో... ఏపీ ప్రభుత్వానికి ప్రతినెలా 1200 కోట్ల నష్టం వాటిల్లుతుందని... నష్టాన్ని భర్తీ చేయాలంటే ఛార్జీల పెంపు తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని పల్లె వెలుగు బస్సు లో కిలోమీటర్ కి  10 పైసలు... సిటీ ఎక్స్ప్రెస్ బస్సు లో కిలోమీటర్ కు  20 పైసల చొప్పున చార్జీలు పెంచింది ఏపీ ప్రభుత్వం. పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమలు కానున్నాయి. అయితే దీనిపై ప్రతిపక్షాలు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆర్టీసీ చార్జీలు పెంచడం వల్ల సామాన్య ప్రజలకు ఆర్టీసీ ప్రయాణం కూడా భారంగా  మారిపోతుందని విమర్శలు గుప్పిస్తున్నాయి. 

 

 

 

 ఇదిలా ఉండగా కేవలం టికెట్ చార్జీలే  కాదు... బస్పాస్  చార్జీలు కూడా ఏపీ ప్రభుత్వం పెంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఛార్జీల పెంపుతో పాటు విద్యార్థులకు అందించే బస్ ధరలు కూడా పెంచింది జగన్ సర్కార్. సిటీలో 4 కిలోమీటర్ల కు ఇచ్చే బస్సు పాస్ ధర  45 నుంచి 55 రూపాయలకు పెంచింది. ఎనిమిది కిలోమీటర్ల కు వచ్చే బస్సు పాస్ కి 55 నుంచి 65 రూపాయలకు పెంచింది. 12 కిలోమీటర్ల కు ఇచ్చే బస్ పాస్ కోసం 60 నుంచి 85 రూపాయలకు పెంచింది. ఇక 18 కిలోమీటర్ల అయితే 75 నుంచి 90, 22 కిలోమీటర్ల అయితే 90 నుంచి 105 రూపాయలకు పెంచుతూ  నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. ఇక అటు గ్రామాల్లో 5 కిలోమీటర్లు ఇచ్చే బస్ పాస్ ధర 80 రూ. నుంచి 100 కు పెరిగింది. 10 కిలోమీటర్లు ఇచ్చే బస్ పాస్ ధర  105 రూ. నుంచి 125 రూ.లకు  పెరిగింది. 15 కిలోమీటర్ల కు ఇచ్చే బస్తా ధర 135 నుంచి 160 రూపాయలు, 20 కి మీ  ఇచ్చే బస్ పాస్ ధర 180 నుంచి 210 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: