నిర్భయ కేసులోని నిందితులకు ఉరిశిక్షను అమలు చేసేందుకు ప్రభుత్వం.. బక్సార్ జైలు నుంచి ఉరి తాళ్లును తెపిస్తున్నారనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో త్వరలోనే వారిని ఉరి తీస్తారనే ఊహాగానాలకు బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే నిందితులలో ఒకడైన అక్షయ్ ఠాకూర్(31) క్షమాభిక్షను కోరుతూ... తనకు విధించిన ఉరిశిక్షను పునఃసమీక్షించాలని... అతడి తరఫు లాయర్ ఏపీ సింగ్ ద్వారా మంగళవారం రోజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.


అయితే, ఇంతకీ ఆ పిటిషన్లో ఏం రాసాడంటే, ' వాయు కాలుష్యం వలన ఢిల్లీ రాజధాని ప్రాంతం, మెట్రో నగరం గ్యాస్‌ ఛాంబర్‌లా మారిందని గుర్తించడం ముఖ్యం. ఇది మాత్రమే కాదు ఢిల్లీలో నీరు, గాలి కూడా విషపూరితమైంది. ఈ నిజాన్ని స్వయంగా భారతదేశ ప్రభుత్వం ఒక నివేదిక ద్వారా పార్లమెంట్ కు తెలియబరిచింది. నీరు, వాయు కాలుష్యంతో ఢిల్లీలో ఎలాంటి పరిస్థితి నెలకొందో ప్రజలందరికీ తెలుసు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఆయువు తగ్గిపోతుంటే మరి ఇంకా ఉరిశిక్ష ఎందుకు?' అని పిచ్చి కారణాలను పేర్కొన్నాడు.  


దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్16న 23ఏళ్ల పారామెడికల్ స్టూడెంట్ నిర్భయను ఆరుగురు నీచులు బస్సులో తిప్పుతూ, అతి పాశవికంగా అత్యచారం చేస్తూ, ఆపై హేయమైన చర్యలకు పాల్పడిన విషయం విదితమే. వారు నిర్భయ మర్మావయవాల్లోకి పదునైన వస్తువులను జొప్పించడంతో, ఆమె తీవ్రగాయాలపాలైంది. దాంతో మెరుగైన చికిత్స నిమిత్తం సింగపూర్ లోని ఎలిజబెత్ ఆసుపత్రికు నిర్భయను తరలించించారు. కానీ 13రోజుల పాటు మృత్యువుతో పోరాడి... డిసెంబర్ 29న ఆమె మృత్యుఒడికి చేరింది. ఈ మృగాళ్లు చేసిన కిరాతకమైన అఘాయిత్యం తరువాత దేశమే ఉలిక్కి పడి కంటతడి పెట్టింది. ఒక్క సుప్రీమ్ కోర్టు తప్ప.



ఈ ఘటన జరిగి 7 ఏళ్లు అవుతుండగా, 6 గురు నిందితులలోని ఒకడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా, మరొకడు బాల నేరస్తుడు కావడంతో 3 ఏళ్ల గరిష్ట జైలు శిక్షను అనుభవించాడు. కాగా, 2013 సెప్టెంబర్ లో ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మిగతా నలుగురు నిందితులకు (ముకేశ్ (30), పవన్ గుప్తా (23), వినయ్ శర్మ (34), అక్షయ్‌ ఠాకూర్) ఉరిశిక్షను విధించాలంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును 2014 లో ఢిల్లీ హైకోర్టు, 2017 మేలో సుప్రీంకోర్టు సమర్థించాయి. అయితే దోషుల్లో ముగ్గురు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. 2018 జూలై 9న అత్యున్నత న్యాయస్థానం వాటిని తిరస్కరించింది. కానీ ఇప్పటికీ వారికి శిక్ష అమలుకాక.. ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: