నారావారి పుత్రరత్నం నారా లోకేష్ పొద్దు పొద్దునే భలే కామెడి చేస్తున్నారు. తనంటే మంత్రులందరూ భయపడుతున్నట్లు చెప్పారు. అసెంబ్లీలో తాను లేకపోవటంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారట. అదే శాసనమండలిలో తానున్నపుడు మాత్రం అసలు నోరే విప్పటం లేదట. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తు తనముందు తన గురుంచి కౌన్సిల్లో మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని మీడియాలో ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది.

 

మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో అనేక అంశాల్లో చర్చలు జరుగుతున్నపుడు లోకేష్ గురించి ప్రస్తావన వచ్చింది. ప్రస్తావన తెచ్చింది కూడా చంద్రబాబునాయుడే.  తన కొడుకును క్రమశిక్షణతో పెంచానని అదే జగన్మోహన్ రెడ్డి మాత్రం అమెరికాకు చదువు కోసం వెళ్ళి వెంటనే వెనక్కు వచ్చేసినట్లు చెప్పారు. తన కొడుకు అమెరికాలో ఉన్నత చదువులు చదువుకొన్నట్లు చెప్పారు.

 

ఈ విషయంలోనే వైసిపి సభ్యులు కాస్త ఎగతాళిగానే మాట్లాడారు. అమెరికా నుండి తిరిగొచ్చేసిన జగన్ ఏపికి ముఖ్యమంత్రయితే అమెరికాలోనే చదువుకున్న లోకేష్ మాత్రం మొద్దబ్బాయిలాగ తయారయ్యాడంటూ ఎద్దేవా చేశారు. మొన్నటి ఎన్నికల్లో పోటి చేసిన లోకేష్ తాను పోటి చేసిన నియోజకవర్గం  మంగళగిరిని మదలగిరి అని పలికిన విషయాన్ని గుర్తు చేశారు.

 

పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీ జరిగితే తనకు అందరూ ఏప్రిల్ 9వ తేదీన ఓట్లేయాలంటూ చేసిన విజ్ఞప్తిని గుర్తు చేశారు. తెలుగు మాట్లాడటం కూడా సక్రమంగా రాని లోకేష్ రాజకీయాల్లో ఎందుకూ పనికిరాడంటూ ఎద్దేవా చేశారు. తెలుగు మాట్లాడటం కూడా సరిగా రాని లోకేష్ ఎందుకు పనికొస్తాడటంటూ నిలదీశారు.

 

సరే ఇటువంటి విషయాలు అనేకం లోకేష్ కేంద్రంగానే సభలో  చర్చ జరిగింది.  ఇదే విషయాన్ని లోకేష్ మీడియాలో మాట్లాడుతూ అసెంబ్లీలో తన గురించి మాట్లాడుతున్న మంత్రులు తానుండే కౌన్సిల్లో మాత్రం ఎందుకు మాట్లాడటం లేదు ? అంటూ ప్రశ్నించారు. తన ముందు మాట్లాడే ధైర్యం లేని కారణంగానే తన ప్రస్తావన తేవటం లేదా ? అంటూ నిలదీశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: