హైదరాబాద్ షాద్నగర్ ఈ చటన్  పల్లి వద్ద వైద్యురాలు దిశా ను  నలుగురు నిందితులు అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన విషయం తెలిసిందే దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించగా... దేశ  వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇక ఆ తర్వాత పోలీసులు నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసారు. కేసూ రీ  కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు  తన నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి తమ వద్ద  తుపాకుల లాక్కుని తమ పైన దాడి చేసేందుకు యత్నించగా ఆత్మరక్షణకోసం ఎన్కౌంటర్ చేసామని పోలీసులు నిందితుల ఎన్కౌంటర్పై వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ కొనసాగిస్తూనే ఉంది. 

 

 

 

 కాగా ఎన్కౌంటర్ లో చనిపోయిన నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారన్న విషయం మొన్న  వెలుగులోకి వచ్చింది.. ఇక తాజాగా చనిపోయిన హంతకుల్లో  మైనర్లు ఇద్దరు కాదు ముగ్గురు అన్న విషయం నిన్ను బయటపడింది. కాగా దిశ కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. ఎన్ కౌంటర్ లో చనిపోయిన నిందితుల ధ్రువీకరణ పత్రాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో... ఎన్కౌంటర్పై విచారణ చేపడుతున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ హంతకుల వయసు ఇలా నిర్ధారించబోతుంది  అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే అటు పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నిందితులు అందరూ మేజర్ లేనని అందరికీ 20 ఏళ్లకుపైగానే  వయసు ఉంటుందని తెలిపారు. 

 

 

 

 కాగా ఎన్ కౌంటర్ లో చనిపోయిన నిందితుల స్కూల్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు పరిశీలించి చూస్తే... హంతకుల  వయసు కేవలం 18 సంవత్సరాల లోపే ఉండడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఆధార్ కార్డ్ వివరాలను బట్టి హంతకుల లో పుట్టిన సంవత్సరం 2001 గా ఉండగా స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్ లో  పుట్టిన తేదీ ఆగస్టు 15, 2002 గా ఉంది. ఇక మరొకరి పుట్టిన తేదీ కూడా 2004 సంవత్సరంలో ఉంది... ఇక నిన్న మరో నిందితుడి బోనఫైడ్ కూడా నిందితుడు తల్లిదండ్రులు సేకరించగా అందులో అతను పుట్టింది 2004 సంవత్సరం లోనే అన్నట్లుగా ధృవీకరించబడింది. ఈ  పత్రాల ప్రకారం ముగ్గురు నిందితులకు వయస్సు 18 సంవత్సరాల లోపే ఉంది. 

 

 

 

 ఈ క్రమంలో నిందితుల వయస్సు ఎలా  ధ్రువీకరించ పోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నిందితుల వయసును ధ్రువీకరించి ఎందుకు ఎలాంటి పత్రాలు లేనప్పుడు నిందితుల ఎముకల దృఢత్వం ఆధారంగా వయసు నిర్ధారిస్తారు. కొన్నిసార్లు స్థానికులను విచారించి నిందితుల వయస్సు  నిర్ధారిస్తారు  అధికారులు. ప్రస్తుతం ఈ కేసులో నిందితుల వయసును అధికారులు ఎలా నిర్ధారించ పోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: