శాసనసభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ప్రసంగాలు సినిమాలలో కామెడీ సీన్స్ కంటే దారుణంగా, పేలవంగా మారుతున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేదానికీ చేసేదానికీ అసలు వెంట్రుకంత కూడా సంబంధం ఉండదనే అభిప్రాయాలను బాబు ప్రసంగాలు మరింత బలపరుస్తూ ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే అనేక రకాలుగా అవకాశవాదాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన అవసరాల మేరకు యూటర్న్ లు తీసుకుంటూనే ఉంటారు. ఎన్నికల ముందు వరకూ బీజేపీని తిట్టిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీతో జత కట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్న విషయాన్నీ ప్రజలు బాగానే గమనిస్తున్నారు.

 

ఇలా ఎలా పడితే అలా అవకాశవాదాన్ని చూపించడానికి చంద్రబాబు నాయుడు ఏ మాత్రం మొహమాట పడటం లేదని స్పష్టం అవుతోంది. ఇలా చంద్రబాబు నాయుడి రాజకీయ విలువలు బయటపడుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో తన పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు నాయుడు తీవ్ర అగ్రహావేశాలను వ్యక్తం చేయడం కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. వల్లభనేని వంశీ మోహన్ ఇటీవలే చంద్రబాబు మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టుగా ఆయన ప్రకటించుకున్నారు. 

 

ఆయన సంగతలా ఉంటే.. ఆయన అసెంబ్లీలో ప్రసంగించడాన్ని తెలుగుదేశం పార్టీ తప్పుపట్టింది. వంశీకి అవకాశం ఇవ్వకూడదని టీడీపీ నిరసనగా బయటకు వెళ్లిపోయింది. ఇక్కడే ఉంది అసలు కథ. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు ఫిరాయింపుదారులకు పెద్దపీట వేశారు. ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ఆయన చేర్చుకున్న సంగతి తెలిసిందే. వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. వారిపై అనర్హత వేటే పడలేదు. అలా ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యే ఒక్కరు తిరుగుబాటు చేసే సరికి తట్టుకోలేకపోతూ ఉన్న తీరుపై రసాభసాగా చర్చ జరుగుతూ ఉంది. ప్రజలు వంశీని సమర్థించకపోయినా.. చంద్రబాబు నాయుడి అవకాశవాదం గురించి మాత్రం చర్చించుకుంటూ ఉన్నారు. అందుకే బాబు ఏం మాట్లాడినా జోకర్ చూస్తూ లైట్ తీసుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: