హైదరాబాద్ మెట్రోరైలు మరో వినూత్న సౌకర్యాన్ని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని ఏ ఇతర మెట్రోరైలు ప్రాజెక్టులో లేని ఉచిత వైఫై సౌకర్యాన్ని హైదరాబాద్ మెట్రోరైలు ప్రయాణీకులకు పరిచయం చేసింది. ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరంగా అన్‌లిమిటెడ్‌గా మొబైల్ డాటాతో అవసరం లేకుండా సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవడంతోపాటు సీరియల్స్‌ను స్పీడ్‌గా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు. మొబైల్ డాటా అవసరం లేకుండా సినిమాలు, సీరియల్స్‌ను అతి ఎక్కువ స్పీడ్‌తో డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. దీనికోసం హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ షుగర్‌బాక్స్ నెట్‌వర్క్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు మంగళవారం షుగర్‌బాక్స్ నెట్‌వర్క్స్ సీఈఓ రోహిత్ పరాంజపే, మెట్రోరైలు ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీరెడ్డి, సీఓఓ అనిల్‌కుమార్ షైనీతో కలిసి హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అధికారికంగా బేగంపేటలోని ఓ హోటల్‌లో ఆవిష్కరించారు. అయితే, ఈ ఒప్పందంలో ఓ ట్విస్ట్ ఉంది.

హ‌ఠాత్తుగా ఢిల్లీకి సజ్జ‌నార్‌...ఏం జ‌రిగిందంటే...

 

దేశంలోని ఏ ఇతర మెట్రోరైలు ప్రాజెక్టులో లేని ఉచిత వైఫై సౌకర్యాన్ని పరిచయం చేసిన సంద‌ర్భంగా  ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ  టెలికం సంస్థలు తమ నష్టాలను పూడ్చుకోవడానికి డాటాను తగ్గించడంతోపాటు చార్జీలు పెంచుతున్న తరుణంలో ఈ సౌకర్యం ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రయాణికులకు అవాంతరాలు లేకుండా వినోదాన్ని అందించేందుకు కొత్తగా అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఇంటర్నెట్ కనెక్టివిటీపై ఆధారపడాల్సిన అవసరం లేదని, మొబైల్ యాప్ ద్వారా సేవలను వినియోగదారులు వినియోగించుకుని విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానమని తెలిపారు. మెట్రోరైలుతో పాటు నగరంలోని ప్రధానమైన 9 మెట్రోస్టేషన్లు, మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు వైఫై సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రయాణికులు తమ అభిమాన చిత్రాలు వీక్షించడం, సంగీతాన్ని ఆస్వాదించవచ్చనీ, దీనిని ఉపయోగించి మేథా సంపత్తిని పెంచుకోవాలన్నారు. మూవీస్, వీడియోస్, ఈ లెర్నింగ్, షాపింగ్, ఫుడ్ డెలివరీ, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ, క్యాబ్ బుకింగ్ వంటి సౌకర్యాలను అందులో ఇన్‌కార్పొరేట్ చేయాలని సూచించారు. డాటాపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా లోకల్ వైఫై నెట్‌వర్క్ షుగర్‌బాక్స్ ద్వారా వినియోగదారులు ZEE5, FREE PLAY యాప్‌ల కంటెంట్‌ను స్మార్ట్ ఫోన్ ద్వారా పొందవచ్చని తెలిపారు. దీనివల్ల మెట్రోరైలును హైదరాబాదీలు ప్రేమిస్తారనే నమ్మకముందన్నారు. 

 

పీకే...జ‌గ‌న్‌పై ఖ‌చ్చితంగా నిరాశ‌తో ఉన్నాట్లే క‌దా? 

షుగర్‌బాక్స్ సీఈవో రోహిత్ మాట్లాడుతూ...ప్రతిరోజు మెట్రోలో ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. గేమింగ్, ఫుడ్, ఈ కామర్స్, ఈ లర్నింగ్ లాంటివి కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఈ సర్వీసును 60 రోజుల పాటు ఉచితంగా అందిస్తాం. తర్వాత ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: