హైదరాబాద్ షాద్నగర్ ఈ చటన్  పల్లి వద్ద వైద్యురాలు దిశా ను  నలుగురు నిందితులు అతి దారుణంగా అత్యాచారం చేసి చంపిన విషయం తెలిసిందే దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించగా... దేశ  వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇక ఆ తర్వాత పోలీసులు నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసారు. కేసూ రీ  కన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు  తన నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి తమ వద్ద  తుపాకుల లాక్కుని తమ పైన దాడి చేసేందుకు యత్నించగా ఆత్మరక్షణకోసం ఎన్కౌంటర్ చేసామని పోలీసులు నిందితుల ఎన్కౌంటర్పై వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ కొనసాగిస్తూనే ఉంది. 

 

 

 

 అటు తెలంగాణ ప్రభుత్వం కూడా దిశా  నిందితుల ఎన్కౌంటర్పై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. కాగా  దిశా  నిందితుల ఎన్కౌంటర్ పై  భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కొంతమంది దిశ ఎన్కౌంటర్ ని సమర్ధిస్తుంటే...  ఇంకొంతమంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే దిశా  కేసులో నిందితుల ఎన్కౌంటర్ చేశారని ఆరోపిస్తున్నారు. కొంతమందికి దిశ నిందితుల ఎన్కౌంటర్ ఫేక్ అంటూ చెబుతున్నారు. దిశా  నిందితుల ఎన్కౌంటర్పై ఫేక్ అని  ఆరోపణలు రావడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ రంగంలోకి దిగడంతో ఈ కేసును విచారించిన అప్పటినుంచి ఎన్కౌంటర్ జరిగే వరకు జరిగిన పరిణామాలు అన్నింటిని పోలీసులు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు వివరించారు.

 

 

 

కాగా  నిన్న ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని విదేశీ మీడియా ప్రతినిధులు సందర్శించడం ఆసక్తికరంగా మారింది. అమెరికాలోని ది న్యూయార్క్ టైమ్స్ పత్రికకు చెందిన సౌత్ ఏషియా ప్రతినిధి ఆధ్వర్యంలో ముగ్గురు జర్నలిస్టులు దిశా  నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన స్థలాన్ని పరిశీలించారు. అంతేకాకుండా చటన్ పల్లి బ్రిడ్జి వద్ద నలుగురు నిందితులు దిశను పెట్రోల్ పోసి దహనం చేసిన స్థలాన్ని కూడా పరిశీలించింది విదేశీ మీడియా బృందం. దిశను దహనం చేసిన స్థలం, ఎన్కౌంటర్ చేసిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు వీడియోలు తీసుకుంది విదేశీ మీడియా బృందం.

మరింత సమాచారం తెలుసుకోండి: