మన భారతీయులంతా పసిడి ప్రియులు. తులం బంగారం తక్కువకి వచ్చిందంటే మన వారంతా షాపుల ముందు ఎగబడి బంగారాన్ని కొనుక్కుని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటారు. అదే వరుసగా ఐదో రోజు కూడా బంగారం భారత్ మార్కెట్ లో అతి చీప్ గా వస్తుంటే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే వెళ్ళి కొనేసి బీరువాలో భద్రంగా దాచుకుంటారు మరి ఇంకా ఆలస్యం ఎందుకు మీ దగ్గరలోని బంగారపు అంగడికి బయలుదేరండి. 

 

ఎందుకంటే గత మూడు నెలల్లో బంగారం ధర 10 గ్రాములకు గానూ 2450 రూపాయలు తగ్గిపోయింది. ఇప్పుడు 0.03% నుండి 3,7570 రూపాయలు ప్రతి 10 గ్రాముల బంగారం పైన ధర తగ్గిపోయింది. గత ఐదు రోజుల్లోనే ప్రతి 10 గ్రాములకు 750 రూపాయల వరకూ పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ లో అయితే 10 గ్రాముల బంగారం 40 వేల రూపాయలకు అత్యధికంగా ఉండగా ఈ రోజు మాత్రం ఆ ధర కాస్తా 2,450 రూపాయల కి తగ్గిపోయింది.


అదేవిధంగా వెండి రేట్లు కూడా 0.05% నుండి కిలోకి 43,465 రూపాయలకు తగ్గిపోయింది. గ్లోబల్ మార్కెట్లలో కూడా బంగారం ధరలు అతి భారీగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. 1,460 డాలర్లు ప్రతి ఔన్సు కు పడిపోవడంతో ఈనెల 15వ తేదీన వచ్చే రౌండ్ కి డెడ్ లైన్ కావడం వల్ల అమెరికా తారీఫులు మరియు చినా దిగుమతులపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి బంగారం కొనాలి అనుకున్న వారంతా త్వరగా త్వరపడి ఇప్పుడే కొనేసుకోవడం మంచిది అని ఆర్థిక శాస్త్ర నిపుణుల అంచనా. ఎందుకంటే 40 వేల చిల్లర ఉండే 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 37,500 రూపాయలు పడిపోవడం అంటే మామూలు తగ్గుదల కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: