ప్రస్తుతం జనాల్లో  అశ్లీల వీడియోలు మోజు ఎక్కువ అయిపోతుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే డేటా ఛార్జీలు ఇంకేముంది అదేపనిగా అశ్లీల వీడియోలు చూస్తూ కాలం గడిపేస్తున్న వారు  చాలా మంది ఉంటారు. వీడియోలు చూసి తాము కూడా అలా చేయాలనుకునే.. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ప్రస్తుతం రోజురోజుకు మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలకు అశ్లీల వీడియోలు కారణమని చెప్పవచ్చు. అయితే చేతిలో స్మార్ట్ఫోన్ ఉంది డేటా ఛార్జీలు కూడా తక్కువగానే ఉన్నాయి కదా అనుకుని ఇక నుంచి అదే పనిగా అశ్లీల వీడియోలు చూస్తే మాత్రం మీకు జైలు శిక్ష తప్పదు. సైబర్ క్రైం కు చెక్కితే అశ్లీల వీడియోలు చూస్తున్నా వాళ్ళు 7ఏళ్ళు  వరకు జైలు జీవితం గడపాల్సి ఉంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో అదే జరుగుతుంది. 

 

 

 

 హైదరాబాదులో వైద్యురాలు దిశ అత్యాచారం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరగకూడదనే ఉద్దేశ్యంతో తమిళనాడు పోలీసులు ఈ కీలక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే అదేపనిగా అశ్లీల వీడియోలు చూస్తున్న వారిని  గుర్తించి... పోలీసులు ముందు  హెచ్చరిస్తారు. ఇక ఆ తర్వాత  కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచి కటకటాల పాలు చేస్తారు. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో కంప్యూటర్లు స్మార్ట్ఫోన్లు టాబ్లెట్ల ద్వారా అశ్లీల వీడియోలను అదేపనిగా గంటలకొద్ది చూస్తున్న వారిని ఐపి అడ్రస్ ద్వారా పోలీసులు గుర్తిస్తూ...అస్లీల  వీడియో చూస్తున్న వారికి హెచ్చరికలు పంపుతున్నారు. ఇప్పటికే చెన్నై సైబర్ క్రైమ్ అధికారులు అదే పనిగా అశ్లీల వీడియోలు చూస్తున్నా మూడు వేల మందిని గుర్తించి వారికి గట్టిగానే  క్లాస్ పీకేందుకు సిద్ధమవుతున్నారు. 

 

 

 

 అదేపనిగా అశ్లీల వీడియోలను చూస్తున్న కొందరిని  ఇప్పటికే హెచ్చరించారు కూడా. గంటల కొద్దీ  అశ్లీల వీడియోలు చూస్తూ కాలం గడుపుతున్న వారిని గుర్తించి ముందు హెచ్చరించడం ఆపైన వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే కేసులు పెట్టి కోర్టులో హాజరు పరచి కటకటాల వెనుకకు తోస్తున్నారు. తిరునల్వేలి లో  కూడా 15 మంది అశ్లీల  వీడియోలు చూస్తూ ఉండేవారిని పోలీసులు హెచ్చరించారు. యువకుడికి చరవాణి  ద్వారా వార్నింగ్ ఇచ్చిన పోలీసులు మరోసారి ఇలాంటిదే జరిగితే 7 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వస్తుంది  అంటూ హెచ్చరించారు. అటు దిశ ఘటన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో  మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: