క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఓ ఎంపి తీసుకుంటున్న స్వతంత్ర నిర్ణయాలు చూస్తుంటే పార్టీలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ఇంతకీ   విషయం ఏమిటంటే నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహార శైలిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను ధిక్కరించి మరీ ఎంపి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు.

 

విషయం ఏమిటంటే ఈరోజు రాత్రి ఢిల్లీలో ఎంపిలందరికీ భారీ ఎత్తున డిన్నర్ ఇస్తున్నారు. తన వియ్యంకుడు, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపి కెవిపి రామచంద్రరావు ఇంట్లో ఇచ్చే డిన్నర్ కు ప్రధానమంత్రి, అమిత్ షా తో పాటు కేంద్రమంత్రులు, ఎంపిలందరినీ విందుకు పిలిచినట్లు సమాచారం.

 

పార్టీ ఎంపిలందరూ ఒకే కట్టుబాటుతో ఉండాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఆ మధ్య ఓ ఆదేశానిచ్చారు. అదేమిటంటే రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి, లోక్ సభ ఎంపి మిథున్ రెడ్డికి తెలియకుండా ఏ ఎంపి కూడా ప్రధాని, కేంద్రమంత్రులను కలవకూడదని. ప్రధాని, కేంద్రమంత్రులను కలవద్దని జగన్ ఎక్కడా చెప్పలేదు. కాకపోతే ఎంపిలు ఎవరిష్టప్రకారం వాళ్ళు ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తుంటే ఎవరు ఎవరిని ఎందుకు కలుస్తున్నారో కూడా పార్టీకే తెలియటం లేదు.

 

ప్రధాని, కేంద్రమంత్రులను కలవటమంటే అంత ఈజీ కాదు. కాబట్టి కలిసేదేదో ముందుగా విజయసాయి, మిథున్ కు తెలిస్తే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అంశాలను లేవనెత్తే అవకాశాలపై చర్చ జరిగి సరైన సమాచారంతో వెళ్ళ వచ్చన్నది జగన్ ఉద్దేశ్యం.

 

మిగిలిన ఎంపిల సంగతేమో కానీ రఘురామ మాత్రం జగన్ ఆదేశాలను ఏ రోజు లెక్క చేయలేదు. కుటుంబసభ్యులతో కలిసి మోడిని కలిశారు. కేంద్రమంత్రులను కూడా తనిష్ట ప్రకారమే కలుస్తున్నారు. దాంతో రఘురామకు జగన్ కు మధ్య గ్యాప్ వచ్చేసింది. ఒకపుడు రఘురామ బిజెపిలో కొద్ది రోజులు పనిచేశారన్న ఏకైక కారణంతో ప్రధానితో పాటు బిజెపి సీనియర్ నేతలు కూడా ఈ ఎంపిని జగన్ కు వ్యతిరేకంగా దువ్వుతున్నారు.

 

సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటి అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా ఎంపి విందు ఇస్తున్నట్లు పైకి చెబుతున్నా అసలు రాజకీయం మాత్రం వేరేగా ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. సరే రాత్రి విందుకు  హాజరయ్యే వాళ్ళెవరు ? గైర్హాజరయ్యే వాళ్ళెవరు అన్నది ఆసక్తిగా మారింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: