హైదరాబాద్లోని షాద్నగర్లో వైద్యురాలు దిశ ను నలుగురు నిందితులు అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే దిశా  హత్య కేసులో ఉన్న నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసారు.. ఈ నేపథ్యంలో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారికి దిశా నిందితుల  ఎన్కౌంటర్ తో వెన్నులో వణుకు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి నేరాలకు పాల్పడిన వారు దిశా నిందితుల ఎన్కౌంటర్ తర్వాత తమను  ఇలాగే పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారు అనుకుని  ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తాజా ఘటనలు చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది మరి. మొన్నటికి మొన్న సిద్దిపేట జిల్లాలో భార్య పిల్లలపై టర్బన్ టైన్  పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన కేసులో  లక్ష్మీ రాజ్యం అనే నిందితుడు తనను పోలీసులు ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారనే భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

 

 

 తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. తాను ప్రేమిస్తున్న యువతి వేరే వ్యక్తితో చనువుగా ఉండటం సహించలేని ఓ వ్యక్తి ఆ యువతి ఇంట్లోకి చొరబడి ఆ యువతి గొంతు కోసి చంపాడు. ఇక ఆ తర్వాత దిశా  నిందితుల ఎన్కౌంటర్ లాగే పోలీసులు తనను కూడా ఎన్కౌంటర్ చేస్తారని భావించిన ఆ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వాగాలకు చెందిన జాదవ్ అరవింద్ తల్లిదండ్రులతో కలిసి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఐడియా బొల్లారం లో ఉంటున్నారు.

 

 

 అయితే అరవింద్ పదోతరగతి చదువుతున్న స్థానిక బాలిక ను ప్రేమించాడు. అయితే ఆమె వేరే యువకులతో చనువుగా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయాడు అరవింద్. గతేడాది ఆమె  ఇంట్లో చొరబడి కత్తితో గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. అయితే హత్య కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం హాస్టల్లో ఉంటూ నాందేడ్ లోని ఓ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. కాగా  దిశ నిందితుల ఎన్కౌంటర్ తర్వాత తనకు కూడా అలాంటి శిక్ష తప్పదని భావించిన అరవింద్ ... సోమవారం ఉదయం తాను ఉంటున్న హాస్టల్ గదిలో  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: