ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే వివేక హత్య జరిగి నెలలు గడుస్తున్నా... ఇప్పటికి ఈ కేసులో విచారణ ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఈ కేసులో విచారణ లో రోజుకో మలుపు తెరమీదికి వస్తూనే ఉంది. కాగా  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వివేకానంద రెడ్డి హత్య లో  మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి హస్తం ఉంది అంటూ గత కొన్ని రోజులుగా ఆంధ్ర రాజకీయాల్లో తెర మీదికి వస్తుంది. కొన్ని రోజుల్లో పోలీసులు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ని విచారించబోతున్నారు అంటూ వార్తలు కూడా వచ్చాయి. కాగా  ఈ వార్తలు ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

 

 

 

 ఇదిలా ఉంటే వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు కూడా సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలపై మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పందించారు. వైసీపీ నేత వివేక హత్య కేసుతో  ఎటువంటి సంబంధమూ లేదని... జగన్ ప్రభుత్వం,  పోలీసులు కావాలనే తన పేరును తెరమీదికి తెస్తున్నారు అంటూ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత వివేకానంద హత్యతో తనకు సంబంధం ఉందని నిరూపణ అయితే బహిరంగంగానే ఉరేసుకుంటా అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

 

 

 కాగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కి వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సిట్  అధికారులు నోటీసులు  ఇచ్చిన విషయం తెలిసిందే. ఆదినారాయణ రెడ్డి స్వగ్రామమైన జమ్మలమడుగు మండలం దేవాగూడలో సిట్ అధికారులు ఈ నోటీసు ఇచ్చారు. అయితే తనకు వచ్చిన నోటీసులపై స్పందించిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి... కడప కు వెళ్లి సీట్ అధికారుల ముందు విచారణకు తాను హాజరు కాబోతున్నాను  అంటూ చెప్పారు. ఈరోజు ఉదయం 8 గంటలకు తనకు ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి నోటీసులు అందాయని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: