ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపుత్రుడు.. మాజీ మంత్రి, టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ కు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఎప్పుడులనే చిన్న విషయానికి కూడా నిరసన చెయ్యడానికి వెళ్లే సమయంలో అయనకు ఈ ప్రమాదం తప్పింది. ఆ ప్రమాదం తప్పడంతో అక్కడే ఉన్న తెలుగు దేశం నేతలు అంత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. 

       

ఇంకా వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు ఓ డ్రోన్ కెమెరా వల్ల ప్రమాదం జరిగేది. అయితే క్షణకాలంలో అతను ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. విద్యుత్ వైర్లకు ఓ డ్రోన్ కెమెరా తగిలి లోకేష్ ముందు పడిపోయింది. లోకేష్ బస్సు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆపరేటింగ్ లోపం కారణంగానే డ్రోన్ కిందపడినట్లు తెలుస్తోంది. 

           

ఆర్టీసీ చార్జీల పెంపు వ్యతిరేకిస్తూ మంగళగిరిలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొనడానికి వచ్చారు. అక్కడే నారా లోకేష్ కు ఈ ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా బస్సు నుంచి లోకేష్ కిందకు దిగిన సమయంలో డ్రోన్ ఆయన ముందు పడిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒక్క అడుగు ముందుకు పడినా ఆ డ్రోన్ లోకేష్ తల మీద పడేది. 

 

ఇందుకే లోకేష్ ని అందరూ అంటారు.. అదృష్టవంతుడు అని. ఏది ఏమైనా నారా లోకేష్ అదృష్టవంతుడు అందుకే ఈ ప్రమాదం తప్పింది అని అంటున్నారు అక్కడ ఉన్న నాయకులు. కాగా, టీడీపీ నిరసన కార్యక్రమాన్ని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరిస్తున్నారు. అలా చిత్రకరించే సమయంలోనే ఆపరేటింగ్ లోపం కారణంగా ఆ డ్రోన్ విద్యుత్ వైర్లకు తగిలి కింద పడిపోయిందని భద్రతా సిబ్బంది తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: