అసెంబ్లీ శీతాకాల సమావేశాల మూడో రోజు సభలో  జరిగిన గొడవతో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయి. స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టే అంశంపై సభలో చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే టిడిపి హయాంలో చంద్రబాబు వైఖరిపై   జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలో ఇంగ్లీషు మీడియం స్కూళ్ళను ఎలా ప్రోత్సహించింది వివరించారు.

 

జగన్ ఆరోపణలు చేసి కూర్చోగానే తనకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ చంద్రబాబు పట్టుబట్టారు. అయితే స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. సభ్యులు మాట్లాడిన తర్వాత అవకాశం ఇస్తానని చంద్రబాబుతో స్పీకర్ చెప్పారు. అయితే స్పీకర్ చెప్పిన మాటలను చంద్రబాబు అండ్ కో వినకుండా గోల మొదలుపెట్టారు.

 

చంద్రబాబు, టిడిపి సభ్యులను కూర్చోవాలని స్పీకర్ ఎంత చెప్పినా వినకుండా గోల చేయటమే కాకుండా స్పీకర్ నే నోటికొచ్చినట్లు మాట్లాడారు. దాంతో స్పీకర్-చంద్రబాబు మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది.  దాంతో స్పీకర్ కు మద్దతుగా వైసిపి ఎంఎల్ఏలు నిలబడ్డారు. స్పీకర్ పైనే నోటికిచ్చినట్లు మాట్లాడుతూ బెదిరించిన కారణంగా చంద్రబాబును వెంటనే సభ నుండి సస్పెండ్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

 

బలహీన వర్గాలకు చెందిన స్పీకర్ తమ్మినేనిని చులకనగా మాట్లాడారని, స్పీకర్ కుర్చీనే బెదిరించిన చంద్రబాబుపై కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ సభ జరిపేందుకు లేదంటూ అంబటి రాంబాబు తదితరులు పట్టుబట్టడంతో సభలో పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది.

 

సమావేశాలు మొదలైన రోజు నుండి కూడా చంద్రబాబు వైఖరి ఇలాగే ఉంటోంది. తాను మాట్లాడాలని అనుకున్నపుడు మైక్ ఇవ్వకపోవటంతో చంద్రబాబులో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తునే ఉన్నారు. స్పీకర్ ను ఉద్దేశించి చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతునే ఉన్నారు. ఈ రోజు చంద్రబాబులోని అసహనం పీక్స్ కు చేరుకుందంతే. తాను సిఎంగా ఉన్నపుడు జగన్ అండ్ కో ను ఇదే సభలో ఎలా ఇబ్బంది పెట్టింది అందరికీ గుర్తుండే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: