నేడు మొదలైన అసెంబ్లీ సమావేశం ఉదయాన్నే రసాభాసగా మారిపోయింది. అయితే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం నిర్ణయంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో... ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం అంశంపై గురువారం నాడు సుదీర్ఘంగా చర్చలు జరుపుతామని... ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి బుగ్గన సూచించారు. నేడు సభలో  ప్రవేశపెట్టాల్సిన బిల్లులు చాలానే ఉన్నాయని ముందు వాటి గురించి చర్చిద్దాం అంటూ తెలిపారు. ఈ చర్చ కాస్త వ్యక్తిగత విమర్శలు వైపు వెళ్ళి పోయింది. ఆ తర్వాత రెడ్డి చెవిరెడ్డి చేసిన  వ్యాఖ్యలు కాస్త  సభలో గందరగోళం సృష్టించాయి. 

 

 

 

 ఈ క్రమంలో సభలో ఇంగ్లీష్ మీడియం పై మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు స్పీకర్ను కోరగా.. ఆంగ్ల మాధ్యమం పై రేపు చర్చిద్దామని... ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు చాలానే ఉన్నాయి అంటూ స్పీకర్ కూడా  సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు.. స్పీకర్ తమ్మినేని సీతారాం కు కనీస సభ్యత లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసిపి టిడిపి మధ్య నేతల వాదోపవాదాల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొంది.అయితే  అసెంబ్లీలో కనీసం స్పీకర్ స్థానానికి కూడా గౌరవం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ ఉందంటూ చంద్రబాబు వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

 పార్టీ నాయకుడు నోరు జారితే ఎమ్మెల్యేలు ఎలా సంయమనంతో ఉంటారంటూ  స్పీకర్ తమ్మినేని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తక్షణమే ఉపసంహరించుకోవాలని.. లేని పక్షంలో వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం హెచ్చరించారు. చంద్రబాబుపై తనకు గౌరవం ఉందని... కానీ పోడియంను అవమానిస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక విపక్ష నేతగా చంద్రబాబు గౌరవంతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ స్పీకర్ తమ్మినేని తెలిపారు. స్పీకర్ స్థానానికి మర్యాద ఇవ్వని మీ 40 ఏళ్ల అనుభవం ఎందుకు ఉపయోగపడిందని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: