ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.  ఈ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.  సభ ప్రారంభం రోజున దిశ కేసు విషయంపైన, మహిళల భద్రత విషయంపైనా సమావేశం జరిగింది.  తొలిరోజు సమావేశంలో అసెంబ్లీలో చర్చలు వాడివేడిగా సాగాయి.  ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలతో సభ దద్దరిల్లిపోయింది.  ఇక రెండో రోజైన మంగళవారం రోజున సభలో ఉల్లి గురించిన విషయాలపై చర్చ జరిగింది.  


ఈ సమావేశాలలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి.  ఈ చర్చల్లో భాగంగా ఉల్లిని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని, రాష్ట్రంలో ఉల్లి కోసం ఇబ్బందులు పడుతున్నారని, రాయితీతో ఇస్తున్న ధరలకు సరిపోవడం లేదని చెప్పి ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళన చేశారు .  ఈ ఆందోళనకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీతో ఉల్లిని అందిస్తోంది.  


అంతకంటే తక్కువ ధరకు ఉల్లిని అందించడం అంటే మామూలు విషయం కాదు.  ఉల్లి కోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందే.  అయితే, ఉల్లి ధర ఇప్పుడు మార్కెట్లోనే ఎక్కువగా ఉన్నది.  ఇక ఇదిలా ఉంటె, మూడో  పెంచిన ఆర్టీసీ టిక్కెట్ల రేట్ల విషయంలో చర్చ జరగబోతున్నది.  ఆర్టీసీ టికెట్స్ పెంపు వలన ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఆర్టీసీ టికెట్స్ పెంచకుండా ప్రత్యామ్నాయం చూడాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.  


కానీ, వైకాపా మాత్రం టికెట్స్ రేట్లు తగ్గించేందుకు ససేమిరా అంటోంది.  2015 తరువాత టికెట్స్ రేట్లు పెంచలేదని, ఇప్పటికే ఆర్తికి వేలకోట్ల నష్టం ఉందని, దానిని కొంతమేర తగ్గించాలంటే కొంతవరకు రేట్లు పెంచక తప్పదని అంటోంది ప్రభుత్వం.  దీంతో సభలో షరా మామూలుగానే రగడ మొదలైంది.  పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నది.  ఏపీలో పెంచిన ఆర్టీసీ టికెట్స్ రేట్లు ఈరోజు నుంచి అమలులోకి రాబోతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: