ఈ రోజుల్లో సినిమా నిర్మాతలకు హీరోలకు పూర్తిగా కష్టాలు వచ్చాయి. ఎంతో కష్టపడి సినిమాలు చేసినప్పటికీ కూడా... పైరసీ గాళ్ళు  దాన్ని ఈజీగా పైరసీ చేస్తూ వారికి భారీ నష్టాన్ని చేకూరుస్తున్నారు . అయితే సినిమాలు పైరసీ చేస్తున్న వారిపై పోలీసులు కూడా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పైరసీ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది కానీ తగ్గటం లేదు . కొత్త సినిమా వచ్చిందంటే చాలు అది 24 గంటల్లో ఆన్లైన్లో ప్రత్యక్షమై పోతుంది. దీంతో భారీగా డబ్బులు ఖర్చు చేసి సినిమాలు తీసిన దర్శకనిర్మాతలు.. భారీగా నష్టాల పాలవుతున్నారు. పోలీసులు పైరసీని అరికట్టేందుకు చర్యలు చేపట్టినా... పరిస్థితిలో  మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా ఇక్కడ ఓ హీరోకి ఇలాంటి సమస్య ఎదురైంది. సినిమాల మీద ఉన్న ఆసక్తితో... 40లక్షలు ఖర్చుపెట్టి సినిమాను  నిర్మించారూ.  కానీ సినిమా విడుదల కాకముందే యూట్యూబ్ లో ప్రత్యక్షమయ్యింది. 

 

 

 దీంతో ఆ సినిమా హీరో కాస్త ఒకింత ఆశ్చర్యానికి ఒకింత షాక్ కి గురయ్యారు. ఇక ఆ సినిమాకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఆ సినిమా హీరో ఫిలిం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... 40 లక్షల బడ్జెట్తో నానిగాడు అనే సినిమాను నిర్మించారు. అయితే ఈ హీరోగా నటుడు దుర్గాప్రసాద్ నటించాడు. అయితే తన సినిమా విడుదల కాకుండానే యూ ట్యూబ్ లో పెట్టారని ఆరోపిస్తూ... హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ముందు ఈ చిత్ర హీరో దుర్గాప్రసాద్ నిరసన తెలిపారు. సినిమాను విడుదలకు ముందే ఆన్లైన్ లో ఉంచడంతో తనకు ఎంతో నష్టం వాటిల్లిందని ఆరోపించారు ఆయన. తన సినిమాకు సెన్సార్ బోర్డ్ నుండి యూ  సర్టిఫికేట్ వచ్చిందని... విడుదలకు అన్నీ సిద్ధం చేసుకుంటున్న వేళ... తన సినిమా ఆన్లైన్ లో ప్రత్యక్షమవడం చూసి షాక్ కు గురయ్యానని దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. 

 

 

 ఇంకొన్ని రోజుల్లో తన సినిమా విడుదల అవుతుంది అని ఆనంద పడుతున్న తరుణంలో... పైరసీ గాళ్లు  ఇంత దారుణానికి ఒడిగట్టారు అని.. సినిమాలు ఆన్లైన్లో ఉంచిన వారిని గుర్తించి  వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిలిం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు నాని గాడు సినిమా హీరో దుర్గాప్రసాద్. వెంటనే ఆన్లైన్ నుంచి తన సినిమా లింక్ ను తొలగించాలని తమ సినిమాకు న్యాయం చేయాలంటూ దుర్గా ప్రసాద్  కోరాడు. లేకపోతే సినిమా బృందం  మొత్తం ఫిలిం ఛాంబర్ ముందు ఆత్మహత్య చేసుకుని చనిపోతాము  అంటూ హెచ్చరించారు. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు దుర్గాప్రసాద్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: