ఇంత దిక్కులేని చావు ఎవరు చావకూడదు. చచ్చేముందు ఒక అమ్మాయిని రాక్షసంగా హించించిన నిందితులు మరణించాక కూడా వారి మృతదేహలు దహన సంస్కారాలకు కూడా ఇప్పటి వరకు నోచుకోకుండా అనాధ శవాల్లా రోడ్లపైనా తిరుగుతు ఉన్నాయి. ఇప్పటివరకు విచారణ పేరుతో ఈ శవాలను ఇంకా వారిని కన్న వారికి ఇవ్వకుండా గాంధీ ఆస్పత్రిలో భద్రపరచారు..

 

 

ఇకపోతే మరణించిన నిందితుల ఎన్‌కౌంటరుపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరగన్న, నేపథ్యంలో నిందితుల కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక నిందితుల మృతదేహాలను రాష్ట్ర హైకోర్టు కూడా శుక్రవారం వరకు భద్రపరచాలని ఆదేశించిన విషయం విదితమే. ఈ కేసు సుప్రీంకోర్టులో బుధవారం విచారణకు రానున్నందున తాము గురువారం దీనిపై విచారిస్తామంటూ హైకోర్టు పేర్కొంది.

 

 

ఇకపోతే ఇప్పటికే గత అయిదు రోజుల నుంచి నిందితుల మృతదేహాలు భద్రపరుస్తూ వస్తున్నారు. మరో మూడు రోజులు గాంధీ ఆస్పత్రిలోనే ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈ కేసులో పిటిషనర్లు ఎన్‌కౌంటరుపై అనుమానాలు వ్యక్తం చేయడంతో అత్యున్నత న్యాయస్థానం మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేయాలని ఆదేశిస్తారా.. లేదా దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం వేస్తారా?.. ఈ రెండూ కాక ఇంకేమైనా మరో తీర్పు చెబుతారా అన్నది ఆసక్తి కలిగిస్తోంది.

 

 

మొత్తానికి శుక్రవారం తుది తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో.. మూడు రోజుల తర్వాత అంత్యక్రియలకు నిందితుల కుటుంబాలు ఏర్పాట్లు చేసుకొంటున్నట్లుగా సమాచారం.. ఇకపోతే వీరిమరణం అత్యాచారాలు చేసే నీచులకు ఒక గుణపాఠంగా చెప్పవచ్చు. చచ్చాక కూడా ఇంతవరకు ఖననం కాకుండా నికృష్టంగా ఎవరు జాలిపడకుండా ఉన్న ఈ దేహాలను చూస్తే ప్రతి వారికి కనీసం వారు చేసినది ఎంత తప్పో ఎంతటి పాపం చేస్తే ఇలాంటి దుస్దితి వస్తుందో అనే విషయం అర్ధం ఐతే చాలు..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: