ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఇస్రో వారు ఇవాళ ఉదయం 11 గంటలకు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరీక్ష కేంద్రం నుండి నేడు పంపబడే ఈ ఉపగ్రహాలకు సంబందించిన కౌంట్ డౌన్ నిన్న సాయంత్రమే మొదలయింది. నేటి సాయంత్రం 4.30 నిమిషాలకు రాహు కాలం ఉన్నందున, అది సరైన ముహూర్తం కాదని భావించి, పలు విధాలుగా ఆలోచనలు చేసిన తరువాత ఫైనల్ గా సరిగ్గా 3.25 నిమిషాలకు ఈ ఉపగ్రహాలను కక్ష్య లోనికి చేరుకోవడానికి ముహూర్తంగా నిశ్చయించారు. 

 

కాగా వీటిలో పీఎస్‌ఎల్వీ సీ48 ద్వారా మన దేశానికి చెందిన రీశాట్ 2బీఆర్‌1 తోపాటు విదేశాలకు చెందిన మరొక 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇస్రో చరిత్రలో పీఎస్‌ఎల్వీ సీ-48 ప్రయోగం6ప్రతిష్టాత్మకమైందని ఇస్రో అధికారులు చెప్తున్నారు. పీఎస్‌ఎల్వీ వాహక నౌకకు ఇది 50వ ప్రయోగం కాగా, శ్రీహరికోట నుంచి ప్రయోగింపబడుతున్న వాటిలో ఇది 75వ ప్రయోగం కావడం విశేషం. శత్రుదేశాల రాడార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎక్కడున్నాయో గుర్తించడం, శత్రుదేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం, చిత్రాలను అందజేచేయడం వంటివి ఇది చేస్తుంది. గతంలో ఈ పనిచేయడానికి డ్రోన్లు, బెలూన్లను ఉపయోగించేవారు కానీ ఇప్పుడు ఇమిశాట్‌ రాకతో 24 గంటలు నిఘావేసే అవకాశం దక్కింది. 

 

దీనితో శత్రు దేశాల కదలికలు చాలావరకు పసిగట్టి వారి కుట్రలను తేలిగ్గా భగ్నం చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. కాగా దీని మొత్తము బరువు 628 కిలోలని సమాచారం. ఇకపోతే నిన్న ఇస్రో చైర్మన్ శివన్, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పీఎస్ఎల్వికి ఇది 50వ ప్రయోగం కావడం విశేషం అని, తప్పకుండా ఈ ప్రయోగంలో సక్సెస్ సాధిస్తాం అని ఆశాభావం వ్యక్తం చేసారు. మన దేశ ప్రజలందరూ కూడా ఈ ప్రయోగం సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఎదురుచూస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: