అసెంబ్లీ సమావేశాల్లో  నాయకులు మాట్లాడుతున్న మాటలు కొన్నిసార్లు నెటిజన్ల ట్రోల్ల్స్  కి గురవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో నాయకులు మాట్లాడుతున్న మాటలు కూడా అలాగే జరుగుతున్నాయి. అయితే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సన్న బియ్యం పై అసెంబ్లీలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ మధ్య వాదోపవాదాలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై... ట్రోల్ చేస్తూ జనసేన పార్టీ ఒ ట్విట్  పెట్టింది. సన్న బియ్యం గురించి గతంలో ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను ప్రస్తుతం అసెంబ్లీలో మాట్లాడిన మాటలను సరిపోల్చుతూ జనసేన ట్వీట్ చేసింది. 

 

 

 

 కాగా ప్రస్తుతం జనసేన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. పేరు జగన్ ఇంటి పేరు యూ టర్న్  అనే హెడ్డింగ్ తో... ఎన్నికల ముందు జగన్ చేసిన వ్యాఖ్యలు... అసెంబ్లీలో సన్న బియ్యం పై జగన్ చేసిన వ్యాఖ్యల్ని సరిపోల్చుతూ పోస్ట్ చేశారు. అయితే సన్న బియ్యం పై అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి... సన్నబియ్యం అనే పదమే లేదు అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలు తినగలిగిన నాణ్యమైన స్వర్ణ తో పాటు... ఇతర రకాల నాణ్యమైన బియ్యంను  సరఫరా చేస్తామని మాత్రమే... ఎన్నికల ముందు తాము చెప్పామంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు సన్న బియ్యం సరఫరాకు వైసీపీ సర్కార్ ఏర్పాటు చేస్తున్నట్టు సాక్షి పత్రికలో కూడా తప్పుగా రాశారు అంటూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. 

 

 

 

 ఈ విషయంపై టిడిపి నేతలు అయోమయానికి గురైనట్లే... వాళ్లు కూడా అయోమయానికి తప్పుగా రాశారు అంటూ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే అసెంబ్లీలో ముందుగా టిడిపి ఎమ్మెల్యే అచ్చం నాయుడు సన్నబియ్యం పై  పలు వ్యాఖ్యలు చేయగా... అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై స్పందించిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆయన  వ్యాఖ్యలను తోసిపుచ్చారు. కాగా  మధ్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సరిపోల్చుతూ జనసేన పెట్టినట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: