అసెంబ్లీలో నామినేటెడ్ పదవులకు సంబంధించి పదవులు కట్టబెట్టిన నామినేటెడ్ పదవుల విషయంలో దాదాపు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు మహిళలకు 50 శాతం పదవులు కట్టబెట్టినట్లు ముఖ్యమంత్రి జగన్ పేర్కొని చంద్రబాబు గతంలో నామినేటెడ్ పదవుల పోస్టుల పట్ల వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. వక్రీకరించే విషయంలో చంద్రబాబు మించిన నాయకుడు మరొకరు దేశంలో లేరని రాబోయే రోజుల్లో 50 శాతానికి మించి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పదవులు కట్ట పెట్టబోతున్నట్లు జగన్ పేర్కొన్నారు. దేశంలో ఈ విధంగా నామినేటెడ్ పదవులు కట్టబెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని జగన్ గర్వంగా అసెంబ్లీలో చెప్పాడు.

 

అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు భార్య.., చంద్రబాబు అత్తా అంటూ… లక్ష్మీ పార్వతి గారికి ఇచ్చిన పోస్టు పదవి పై జగన్ స్పందించారు. అత్తగారిని అన్యాయంగా మీరు వదిలేసిన  మేము న్యాయం చేశామని అసెంబ్లీలో జగన్ పేర్కొన్నారు. మా క్యాబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు బీసీలు ఉన్నారని సగర్వంగా చెబుతున్నట్లు జగన్ పేర్కొన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో హోంమంత్రి ఎస్ సి అని మహిళ అని మరియు అదే విధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కి సంబంధించి ఎస్సీ వర్గానికి చెందిన మాదిగ కులానికి చెందిన సురేష్ అని చెప్పడంలో సగర్వంగా గర్వపడుతున్నట్లు జగన్ పేర్కొన్నారు.

 

ఇంతగా దేశంలో అందరినీ కలుపుకొని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్న పార్టీ వైయస్సార్ సిపి పార్టీ అని జగన్ పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాల గురించి మాట్లాడుతూ చంద్రబాబు పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ నిప్పులు చెరిగారు. నామినేటెడ్ పదవులతో నీచమైన రాజకీయాలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అని జగన్ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఇంకా మిగిలి ఉన్న నామినేటెడ్ పదవులను పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తి చేయబోతున్నట్లు వ్యక్తులను నియమించబోతున్నట్లు జగన్ క్లారిటీ ఇచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: