జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జనసేన ఒకేఒక ఎమ్మెల్యే గెట్టి షాక్ ఇచ్చారు. ఆ షాక్ తో కింద పది గిలగిలా కొట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అంత గెట్టి షాక్ ఏంటి అని అనుకుంటున్నారా ? ఇంకేం షాక్ అండి బాబు. ఇంగ్లీష్ షాక్. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అయన వ్యాఖ్య చేసారు. 

 

ఆ మంచి నిర్ణయం ఏంటి అని అనుకుంటున్నారా.. అదేనండి. ఇంగ్లిష్ మీడియం నిర్ణయం. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో జనసేన ఒకేఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మట్లాడుతూ ఆయన ఇంగ్లీష్ మీడియంపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మధ్యలో వదిలేసిన ఇంగ్లిష్ మీడియం ప్రయత్నాలను జగన్‌ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తోందని రాపాక అన్నారు. 

 

ఈ మంచి నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని, పేద విద్యార్థుల కోసం వైసీపీ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత స్పీకర్‌ను గౌరవించాల్సిన బాధ్యత ఉందని రాపాక చెప్పారు. కాగా గతంలోనూ వైసీపీ ప్రభుత్వంపై రాపాక ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అయితే ఒకవైపు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తుంటే ఈ ఒక్కగానొక్క ఎమ్మెల్యే ఇది మంచి నిర్ణయం అనడం ప్రస్తుతం సంచలనమైంది. 

                      

అంటే దీనిబట్టి చూస్తే.. ఎప్పుడు వైసీపీని పొగిడే ఎమ్మెల్యే రాపాక త్వరలోనే వైసీపీ గూటికి చేరుతారు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే ఇలా అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించిన పట్టించుకోకుండా ఎమ్మెల్యే రాపాక ఇలా చేస్తున్నారని అంటున్నారు. మరి ఎం అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: