సాధారణంగా బట్టలు ఉతకడం అంటే ఈ మద్య చాలా మందికి తలకు మించిన భారంగా భావిస్తున్నారు.  అందుకే వాషింగ్ మిషన్లు విరివిగా అమ్ముడు పోతున్నాయి.  కానీ మన చేతితో ఉతికే బట్టల మురికి ఆ మిషన్లు ఎంత వరకు వదిలిస్తాయిన అన్న విషయం పక్కన బెడితే.. త్వరగా పనైపోతుంది, మాకు కాస్త స్వేచ్ఛ దొరుకుతుంది అని అంటున్నారు ఆడవారు. సాధారణంగా జూ పార్కుల్లో చింపాంజీలను చూస్తుంటాం.. దాదాపు అవి మనిషి చేసే ప్రతి పని అనుకరిస్తుంది.  సినిమాల్లో చింపాంజీలు చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..ఎన్నో తెలుగు సినిమాల్లో సిగరేట్ కాల్చడం.. డ్రెస్సులు వేసుకొని హీరో వెంటన తిరగడం.. చిత్ర విచిత్రమైన జిమ్మిక్కులు చేయడం చూస్తునే ఉన్నాం.  

 

అయితే మానవుడుని పోలినట్టు ఉంటే చింపాంజీలు నడవడం..కూర్చోవడం.. డ్యాన్స్ ఒక్క మాటలు తప్ప అన్నీ చేయగలవు.  తాజాగా ఓ చింపాంజీ బట్టలు ఉతకడం అందరినీ విస్మయానికి  గురి చేసింది. చైనా జూలోని 18 ఏళ్ల యూహూ చింపాంజీ... బట్టలు ఉతికి అందర్నీ ఆశ్చర్యపరిచింది.  లేహే లేడు థీమ్ పార్కులో ఉండే ఆ చింపాంజీ... ఏకంగా 30 నిమిషాలపాటూ బట్టలు ఉతికింది. తన కీపర్ (సంరక్షకుడు) టీ-షర్టును సోప్ బార్, బ్రష్ వాడి ఉతికింది. అంతే... ఆ వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. వైరల్ అయ్యింది.

 

ఇదివరకు కొన్ని కొన్నింటిని ఇలాగే కాపీ కొట్టిన ఆ చింపాంజీ. ఇదంతా పక్కన మరో చింపాంజీ చాలా సీరియస్ గా  చూస్తూ ఆ బట్టలు ఉతుకుతున్న చింపాంజీని పర్యవేక్షిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే బట్టలు ఇలా వాష్‌ చేయాలని చింపాంజీకి తానెప్పుడూ శిక్షణ ఇవ్వలేదని జూ కీపర్‌ స్పష్టం చేశారు. చింపాంజీ బట్టలు వాష్‌ చేయడాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: