ఆంధ్రప్రదేశ్ లో శీతాకాలసమావేశాలు ప్రారంభమై ఇది మూడవ రోజు ప్రాంభమైన రోజు నుండి అసెంబ్లీ లో వాడి వేడి గ చర్చలు కొనసాగుతున్నాయి ఆ చర్చల్లో భాగంగా ఈ రోజు  అసెంబ్లీలో నామినేటెడ్ పోస్టులు, సలహాదారు పదవుల గురించి చర్చ జరిగింది   ఆ సందర్భం గ టీడీపీ ఎమ్మెల్యే లకు వైసీపీ ఎమ్మెల్యే ల కు మాటల యుద్ధం నడిచింది. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్  నామినేటెడ్ పోస్ట్ ల గురించిప్రశ్నించారు మంత్రి కురసాల కన్నబాబు సమాధానం చెప్పగా  . కానీ సత్యప్రసాద్ మాత్రం ఒకే వర్గానికి ఈ సలహాదారుల పోస్టులు కట్టబెట్టారు అంటూ ఎద్దవా చేసారు.

 

దీనిపై వెంటనే ముఖ్యమంత్రి జగన్‌.. ప్రతిపక్షం టీడీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని.. నామినేటెడ్ పోస్టుల్లో 50శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించిన ఘనత తమకె  దక్కుతుందన్నారు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు అంటూ  ఆ  సందర్భంగా జగన్ ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్, సలహాదారు పదవులకు సంబంధించిన జాబితానను అంతటి ని సభ ముందు ఉంచారు.

 

నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్రం ఏపీ మాత్రమేనని.. కేబినెట్‌లోనూ అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఓ దళిత మహిళకు హోంమంత్రి పదవి, ఓ ఎస్టీ మహిళకు డిప్యూటీ సీఎం పదవి  ఇచ్చిన ఘనత తమప్రభుత్వం డి అని . త్వరలోనే భర్తీ చేయబోయే పదవుల్లో కూడా అన్ని వర్గాలకు సరైన ప్రాముఖ్యత   ఇస్తామన్నారు..అంతేకాదు నామినేటెడ్ పోస్టుల్లో తెలుగు అకాడమీ చైర్మన్‌గా చంద్రబాబు అత్తగారైన లక్ష్మీపార్వతిని నియమించామని సీఎం జగన్ అన్నారు.

 

'ఆమెకు పదవిని మీరు ఇవ్వాళ ఇక పోయిన  మేం ఇచ్చాం' అని జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్కెట్‌ యార్డ్‌, దేవాలయ కమిటీ చైర్మన్‌ పోస్టుల్లోనూ 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని తెలిపారు. టీడీపీ హయాంలో ఏదైనా నామినేటెడ్ పదవి దక్కాలంటే లాబీయింగ్ ఉండేదని.. తాము మాత్రం అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. దీనిపై ప్రతిపక్షానిది అనవసరగొడవ చేసి సభ ప్రాంగణం లో గందర గోళం చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు .
 

మరింత సమాచారం తెలుసుకోండి: