పౌరసత్వ చట్ట సవరణ బిల్లు విషయమై రాజ్యసభ శీతాకాలం సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో అమిత్ షా మాట్లాడుతూ పౌరసత్వ చట్టం సవరణ బిల్లు మేనిఫెస్టోలో పెట్టినట్లు అమిత్ షా తెలిపారు. ఈ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్రాలలో కొంత మంది ప్రజలు భయపడుతున్నారని… కానీ భయపడాల్సిన అవసరం లేదని వారికి ఉన్న అపోహలను తొలగిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. ఈ బిల్లు విషయంలో ముస్లింలు కూడా ఆందోళన చెందవలసిన అవసరంలేదని దేశంలో ఉన్న ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని భారత్ లో మైనార్టీలకు పూర్తి రక్షణ ఉంది అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

 

అంతేకాకుండా ప్రస్తుతం దేశంలో మైనార్టీలపై దాడులు వంటి విషయాలు ఎక్కువవుతున్న క్రమంలో ఈ బిల్లు వల్ల వాళ్లు నిర్భయంగా దేశంలో బతికే అవకాశం ఉంటుందని వారి హక్కులు వారికి ఉంటాయని అమిత్ షా రాజ్యసభ సాక్షిగా పౌరసత్వ సవరణ బిల్లు చరిత్రాత్మకమైన బిల్లు అంటూ అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.

 

ఈ బిల్లు వల్ల దేశంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎవరి హక్కులు వారికి కాపాడటం కోసమే పౌరసత్వ సవరణ బిల్ తీసుకురావడం జరిగిందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. అయితే మరోపక్క పార్లమెంటులో ఈ బిల్లుకు అనుకూలంగా 121 మంది సభ్యులు మరియు వ్యతిరేకంగా 113 సభ్యులు వ్యవహరిస్తున్నారు. ఎటూ తేల్చుకోలేని స్థితిలో 6 సభ్యులు ఉన్నారు.

 

తాజాగా జరిగిన రాజ్యసభ సమావేశంలో అమిత్ షా…. ప్రధాని మోడీ హయాంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో చేపట్టబోతున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. కాబట్టి ఎవరూ కూడా దేశంలో  పౌరసత్వ చట్ట సవరణ బిల్లు విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరి హక్కులు కాపాడటం కోసమే పౌరసత్వ చట్ట సవరణ బిల్లు తీసుకురాబోతున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: