ఏపీలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో మూడోరోజు అధికార వైసిపి.. విపక్ష టిడిపి నేతల మధ్య అదిరిపోయే నడుస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం నడవడంతో రెండు పక్షాల నేతలు ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకున్నారు. తెలుగు మీడియం స్కూల్స్ పై అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు స్పీకర్ ఇదేమన్నా ఖ‌వ్వాలీ డ్యాన్సా అనగా వెంటనే కుర్చీలో నుంచి లేచిన చంద్రబాబు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్యాదగా ఉండాలంటూ స్పీక‌ర్ ను ఉద్దేశించి వార్నింగ్‌ ఇవ్వడంతో.. అటు త‌మ్మినేని సైతం బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 

చంద్రబాబు అంటే తనకు గౌరవం ఉన్నా.. స్పీకర్ కుర్చీకి ఆయన ఎంత మాత్రం గౌరవం ఇవ్వడం లేదంటూ తమ్మినేని విమర్శించారు. ఈ క్రమంలోనే పలువురు వైసిపి ఎమ్మెల్యేలు సైతం బాబు తీరు పై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ చంద్రబాబు తీరు చూస్తుంటే చాలా భయంగా ఉంది... ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు.

 

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అప్పలరాజు... ఆయన సేవలు ఇక చాలని.. ఆయన రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. అసెంబ్లీలో తాము చాలా జూనియర్స్ అని.. సీనియర్ల నుంచి చాలా నేర్చుకోవాలి ఉందని.. స్పీక‌ర్ గారిది త‌మ ఊరే అని.. వెన‌క ప‌డిన వ‌ర్గాల‌కు చెందిన ఆయ‌న‌కు స్పీక‌ర్ ప‌ద‌వి ఇస్తే చైర్‌లో కూర్చోబెట్టేందుకు కూడా చంద్రబాబు రాలేద‌ని అప్ప‌ల‌రాజు విమ‌ర్శించారు.

 

బాబుకు మానసిక వ్యాధి బాగా ముదిరి పోయింది అని.. ఆయనకు పరీక్షలు చేయించాలి... జబ్బు నయం అయ్యాకే అసెంబ్లీలోకి తీసుకురావాలి... చంద్రబాబు రాజకీయాల్లో తన 40 ఏళ్ల అనుభవం అని చెబుతూ ఉంటారు... ఆయన సేవలు ఇక చాలు విశ్రాంతి తీసుకోవచ్చని అప్పలరాజు చెప్పారు. మొన్న పార్లమెంట్‌కు వెళ్లినప్పుడు వంగి ఉన్నారు... నిన్న అమరావతి వెళ్లి పడుకున్నారు.... అసెంబ్లీ సమావేశాల్లో దండ వేసుకున్నారు. ఆయనను చూస్తే భయంగా ఉంద‌ని సెటైర్లు వేశారు. ఏదేమైనా ఓ డాక్ట‌ర్‌గా ఉన్న అప్ప‌ల రాజు బాబును టార్గెట్ గా చేసుకుని అదిరిపోయే పంచ్‌ల‌తో విరుచుకు ప‌డ్డారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: