ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సభలో ఈరోజు స్పీకర్ పై చంద్రబాబు సీరియస్ అవ్వగా వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు "సభలో మర్యాదగా నడుచుకోవాలంటూ" స్పీకర్ పై చంద్రబాబు ఫైర్ అయ్యారు చంద్రబాబు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన స్పీకర్ మీరు నాకు మర్యాద నేర్పుతున్నారా?, మీ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోండి అని చంద్రబాబు ను కోరారు. 

 

స్పీకర్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం లేపడంతో సభ వైసీపీ నేతల నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ "రేపు మహిళా భద్రత బిల్లు పై చర్చిద్దాం అని మేము చెప్పనా, మీరు ఈరోజే చేయలంటూ పట్టుబట్టడం ఏంటి, స్పీకర్ ను మర్యాదగా నడుచుకోండి అంటూ వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసం" అంటూ ప్రశ్నించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ "గౌరవ ప్రతిపక్ష నేత వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరం, ప్రతిపక్ష నేత ను సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అని అన్నారు.

 

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ " 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటావు, నీ అనుభవం అంత లేదు అంటావు మా వయసు, సభలో ఎలా నడుచుకోవాలో నేర్పించలేదా నీ 40 సంవత్సరాల అనుభవం, ఈరోజు స్పీకర్ ను చైర్ ను మీరు అవమానించారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెడన ఎమ్యెల్యే జోగి రమేష్ చంద్రబాబు బడుగు బలహీన వర్గాలను అవమానించారని చెప్పారు. స్పీకర్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే లు మాత్రం స్పీకర్ తమ పట్ల వ్యవహరించిన తీరు బాలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం అన్నట్లు స్పీకర్ వ్యవహారం ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: